iDreamPost
android-app
ios-app

భర్త కొడుతున్నాడంటూ తమ్ముడి ఇంటికి వచ్చిన అక్క.. చివరకు

పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయిన మహిళ.. తరచూ తమ్ముడి దగ్గరకు వస్తూ ఉండేది. భర్త ఇంటి దగ్గర కన్నా.. సోదరుడి ఇంటే సమయం గడిపేది. కానీ ఓ రోజు ఆ ఇంటి నుండి

పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయిన మహిళ.. తరచూ తమ్ముడి దగ్గరకు వస్తూ ఉండేది. భర్త ఇంటి దగ్గర కన్నా.. సోదరుడి ఇంటే సమయం గడిపేది. కానీ ఓ రోజు ఆ ఇంటి నుండి

భర్త కొడుతున్నాడంటూ తమ్ముడి ఇంటికి వచ్చిన అక్క.. చివరకు

మన ఫస్ట్ ఫ్రెండ్, శత్రువు ఎవరంటే.. మన తోడబుట్టిన వాళ్లే. వాళ్లతో ఉంటే చనువు, గొడవ మరెవ్వరితో ఉండవు. అలాగే డ్రెస్సులు, బుక్స్ పంచుకోవడమే కాదూ.. షేర్ చేసుకుంటూ ఉంటాం. ఇక అక్కా తమ్మడు, అన్నా చెల్లెల్ల బాండింగే వేరే లెవల్. ఇద్దరూ ఒకరిపై ఒకరు శాడీలు చెప్పుకుంటూ బద్ద శత్రువుల్లా మెలుగుతుంటారు. వీరికి ఏదైనా అవసరం అయితే.. ఏకతాటిపైకి వచ్చి ప్రాణ మిత్రుల్లా కలిసిపోతుంటారు. అయితే అక్కా, తమ్ముళ్ల బంధంలో ప్రేమ, వాత్సల్యత కాస్త ఎక్కువగా ఉంటుంది. తమ్ముడిని బిడ్డగా భావించి సపర్యలు చేస్తుంది. చాన్నాళ్లు ఆమెతో పోట్లాడి.. అత్తారింటికి వెళ్లిపోతున్న అక్క కోసం కంటతడి పెడుతుంటాడు తమ్ముడు.

ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు అక్కా తమ్ముళ్లు. అక్కకు తమ్ముడంటే ప్రాణం.. తమ్ముడికి కూడా అక్కంటే అంతే ఇష్టం. అక్కకు పెళ్లై భర్త వద్దకు వెళ్లిపోతుంటే..విలవిలలాడిపోయాడు తమ్మడు. కానీ ఆమె కాపురం సజావుగా సాగలేదు. భర్త హింసించడంతో తరచూ తమ్ముడి దగ్గరకు వచ్చి తన గోడు వెళ్లి బుచ్చుకునేది. తన భర్త ఇంట్లో కన్నా అక్కడే ఎక్కువ ఉంది. కానీ ఓ రోజు వారిద్దరు ఉంటున్న ఇంటి నుండి దుర్వాసన వస్తుంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. తలుపులు తీసి చూడగా ఇద్దరు చనిపోయి.. వారి దేహాలు కుళ్లిన స్థితిలో ఉన్నాయి. అనుమానాస్పదంగా అక్కాతమ్ముళ్లు చనిపోవడం స్థానికంగా కలకలం రేగింది. ఈ ఘటన హైదరాబాద్ మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Brother and sister sucide

వివరాల్లోకి వెళితే.. రహమత్ నగర్ డివిజన్ సంతోష గిరి బస్తీలో అక్కా తమ్ముళ్లు సాయి, రాజశ్రీ నివాసం ఉంటున్నారు. అక్క రాజశ్రీకి పదేళ్ల క్రితమే నర్సింగరావు అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే రాజశ్రీని భర్త వేధిస్తుండటంతో తమ్ముడి దగ్గరకు వచ్చి ఉండిపోయేది. ఆ సమయంలో ఇద్దరు కలిసి కల్లు సేవించేవారు. అయితే సోమవారం ఆ ఇంటి నుండి దుర్వాసన రావడం, పోలీసులకు సమాచారం అందడంతో వెళ్లి చూడగా.. ఇద్దరి మృతదేహాలతో పాటు ఓ ఆత్మహత్య లేఖ కూడా లభించింది. అందులో భర్త, పెద్దమ్మ, సోదరుడు తనను సరిగ్గా చూడలేదని, బతకాలని లేదని రాసింది రాజశ్రీ. అయితే ఈ మృతికి గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.