iDreamPost
android-app
ios-app

HYDలో దారుణం.. వివాహితపై యువకుడు దారుణం

హైదరాబాద్ పాత బస్తీ పరిధిలోని చత్రినాకలో ఘోరం జరిగింది. పట్టపగలు శ్రావ్య ఇంట్లోకి దూరి.. తలుపులు బిగించి దారుణానికి ఒడిగట్టాడు మణికంఠ అనే వ్యక్తి.

హైదరాబాద్ పాత బస్తీ పరిధిలోని చత్రినాకలో ఘోరం జరిగింది. పట్టపగలు శ్రావ్య ఇంట్లోకి దూరి.. తలుపులు బిగించి దారుణానికి ఒడిగట్టాడు మణికంఠ అనే వ్యక్తి.

HYDలో దారుణం.. వివాహితపై యువకుడు దారుణం

హైదరాబాద్ పాతబస్తీలో ఘోరం చోటుచేసుకుంది. చత్రినాకలోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహితపై దాడి చేశాడో వ్యక్తి. ఎస్ఆర్టీసీలో కాలనీలో శ్రావ్య అనే వివాహితపై గౌలిపుర ప్రాంతానికి చెందిన మణికంఠ కత్తి పీటతో మెడపై దాడి చేశాడు. ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్ఆర్టీ కాలనీలో తల్లితో కలిసి ఉంటుంది శ్రావ్య. ఉదయం జిమ్‌కు వెళ్లి ఇంటికి వచ్చింది శ్రావ్య. ఆమెను ఫాలో అవుతూ ఇంట్లోకి వచ్చాడు మణికంఠ. అనంతరం తలుపులు బిగించి.. కత్తిపీటతో తలపై దాడి చేశాడు. అనంతరం సైకోలా ఆమె కళ్లపై పొడవడం ప్రారంభించారు. ఆమె కేకలు వేయడంతో పై అంతస్థులో ఉంటున్న వ్యక్తులు వచ్చి.. అతడ్ని నిలువరించేందుకు ప్రయత్నించారు.

తలుపులు వేసి ఉండటంతో.. కిటీకి అద్దాలు పగులగొట్టి.. మణికంఠను ఆపేందుకు ట్రై చేశారు. అయినా వినిపించుకోకుండా ఆమె మెడపై కోస్తున్నాడు. దీంతో హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులను చూసి బెదరలేదు మణికంఠ. దీంతో తలుపులు పగులగొట్టి.. ఆమెను ఆసుపత్రికి తరలించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, శ్రావ్యకు మణికంఠతో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. అప్పుడప్పుడు ఇంటి దగ్గరలో మాట్లాడుకునే వారని చెబుతున్నారు. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దారుణం జరిగిందని అంటున్నారు. ఇంట్లోకి వెళ్లి తలుపులు బిగించి.. కత్తిపీటతో దాడి చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler