iDreamPost
android-app
ios-app

HYD: ప్రియుడితో కూతుర్ని అలా చూసిన తల్లి.. తట్టుకోలేక

  • Published Mar 19, 2024 | 2:06 PM Updated Updated Mar 19, 2024 | 6:13 PM

చదువుకోమని పంపింస్తే.. కూతురు మరొకరితో ప్రేమ అంటూ వ్యవహారం సాగించడం నచ్చలేదు తల్లిదండ్రులకు, వెంటనే ఆమెను చదువు మాన్పించి.. మరొకరితో పెళ్లి నిశ్చయించారు. అంతలో ప్రియుడ్ని ఇంటికి రమ్మని పిలిచింది కూతురు.

చదువుకోమని పంపింస్తే.. కూతురు మరొకరితో ప్రేమ అంటూ వ్యవహారం సాగించడం నచ్చలేదు తల్లిదండ్రులకు, వెంటనే ఆమెను చదువు మాన్పించి.. మరొకరితో పెళ్లి నిశ్చయించారు. అంతలో ప్రియుడ్ని ఇంటికి రమ్మని పిలిచింది కూతురు.

  • Published Mar 19, 2024 | 2:06 PMUpdated Mar 19, 2024 | 6:13 PM
HYD: ప్రియుడితో కూతుర్ని అలా చూసిన తల్లి.. తట్టుకోలేక

చక్కగా చదువుకోమని పంపిస్తే..ప్రేమ, దోమ అంటూ వ్యవహారాలు సాగిస్తున్నారు అమ్మాయిలు. ప్రేమ, క్రష్, ఇన్ఫ్యాచుయేషన్ తేడా తెలియకుండా.. నాలుగు సార్లు తన వెంటబడిన వ్యక్తితో లవ్ అంటూ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. పిల్లలపై నమ్మకంతో వారిని దూరభారాలైన కాలేజీలకు పంపిస్తున్నారు. కానీ పేరెంట్స్ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. లవర్ ఉండటం ఓ స్టేటస్ సింబల్ అని భావిస్తున్న యువత.. చిన్న వయస్సులోనే దారి తప్పుతున్నారు. టెన్త్, ఇంటర్ అయ్యి.. ఇలా డిగ్రీలోకి అడుగుపెడుతున్నారో లేదో లవ్ పాఠాలు మొదలుపెడుతున్నారు. కొద్దీ రోజుల్లోనే వాళ్లల్లో వస్తున్న మార్పులు చూసి తల్లిదండ్రులు పసిగట్టేస్తున్నారు. చివరకు నిలదీస్తే.. ఎవడి ప్రేమలో కూతురు మునిగిపోయిందని తెలిసి, చదువు మాన్పించేసి, మరొకరితో వివాహం చేసేస్తున్నారు.

పరువు కోసం పాకులాడే తల్లిదండ్రులు కూడా ఆడ పిల్లలకు ప్రేమ, పెళ్లి విషయంలో ఛాయిస్, ఛాన్స్ ఇవ్వడం లేదు. తమ సామాజిక వర్గానికి చెందని వాడ్ని, ముక్కు మొహం తెలియని అనాకారిని కూతురు ఇస్టపడితే.. సహించలేదు, భరించలేకపోతున్నారు. వెంటనే మరొక వ్యక్తితో పెళ్లి చేసేస్తున్నారు. కానీ అమ్మాయిలు మరో వ్యక్తిని పెళ్లి చేసుకోలేక, ప్రేమించిన ప్రియుడ్ని వదులుకోలేక.. సతమతమౌతున్నారు. ఇలాంటి పరిస్థితులే ఎంతటి దారుణానికైనా దారి తీస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓ యువతి అనుమానాస్పద రీతిలో మరణించింది. దండు మైలారం గ్రామానికి చెందిన ఎం భార్గవి ఇంట్లోనే మృతి చెందింది. అయితే పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది పరువు హత్యగా భావిస్తున్నారు పోలీసులు. ప్రాథమిక విచారణలో తేలిన వివరాలు ఇలా ఉన్నాయి.

మోతే జంగమ్మ, ఐలయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కూతురు భార్గవి.. దిల్ సుఖ్ నగర్‌లోని అనిబీసెంట్ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో చదువుతుంది. అదే గ్రామానికి చెందిన శశి అనే యువకుడి ప్రేమలో పడింది భార్గవి. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో మందలించి, ఆమెను కాలేజీ మాన్పించి.. మరో అబ్బాయితో పెళ్లి నిశ్చయించారు. అయితే సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో భార్గవి..తాను ప్రేమిస్తున్న యువకుడికి కబురు పెట్టింది. అంతలో తల్లి అతడు రావడం గమనించింది. ఈ విషయంపై తల్లి, కూతుళ్లకు గొడవ జరిగింది. ఆ తర్వాత శవమై వేలాడుతూ కనిపించింది కూతురు. మరికొన్ని రోజుల్లో పెళ్లి ఉంది అనగా.. కూతురు మరొకరితో కనిపించడం చూసి తట్టుకోలేక.. తల్లే కూతుర్ని హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది.

కుమారుడి ఇచ్చిన వాంగూల్మంతో కేసు నమోదు చేశారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా.. భార్గవి హత్యకేసులో తల్లికాదు ప్రియుడు శశినే చంపాడని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మృతురాలి తండ్రి ఐలయ్య మాట్లాడుతూ.. “కన్నతల్లి ఎక్కడనైనా కూతుర్ని చంపుకుంటుందా? అని ప్రశ్నించాడు. నిన్న మధ్యాహ్నం నా భార్య ఇంటికి వచ్చే సరికి శశి ఇంట్లో ఉన్నాడని తెలిపాడు. నా భార్యను చూసి పారిపోయాడు. భార్గవిని శశి చంపి పారిపోయాడనే అనుమానం ఉందని, అయితే నా కూతురును చూసి షాక్ తో నా భార్య మాట్లాడలేని పరిస్థితికి వచ్చింది” అని వెల్లడించాడు. ఇలా రెండు రకాలుగా భార్గవి మరణంపై వార్తలు వినిపిస్తోన్నా..పోలీసులు మాత్రం అధికారికంగా దేనిని ధృవీకరించలేదు. ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom