iDreamPost
android-app
ios-app

ఆడదానిలా పద్దతిగా బతుకు అన్నందుకు.. అమ్మని చంపేసిన కూతురు!

జ్యూస్ కొందామని బయటకు వెళ్లింది కాజల్. ఇంటికి వచ్చే సరికి తల్లి మంచంపై విగతజీవిగా పడి ఉంది. ఆమె తలకు గాయం అయ్యింది. ఇంకో రూంలోకి వెళ్లి చూడగా.. సోదరుడు కూడా హత్యకు గురై కనిపించాడు. పోలీసులు ఎంట్రీ ఇచ్చినప్పుడు కాజల్ వారికి చెప్పిన స్టోరీ ఇది. తీరా చూస్తే..

జ్యూస్ కొందామని బయటకు వెళ్లింది కాజల్. ఇంటికి వచ్చే సరికి తల్లి మంచంపై విగతజీవిగా పడి ఉంది. ఆమె తలకు గాయం అయ్యింది. ఇంకో రూంలోకి వెళ్లి చూడగా.. సోదరుడు కూడా హత్యకు గురై కనిపించాడు. పోలీసులు ఎంట్రీ ఇచ్చినప్పుడు కాజల్ వారికి చెప్పిన స్టోరీ ఇది. తీరా చూస్తే..

ఆడదానిలా పద్దతిగా బతుకు అన్నందుకు..  అమ్మని చంపేసిన కూతురు!

ఈ ఫోటోలోని అమ్మాయి పేరు కాజల్. చిన్నప్పటి నుండి టామ్ బాయ్‌లా పెరిగింది. ఆమె తల్లి మీనా, సోదరుడు రాహుల్‌తో కలిసి జీవిస్తుంది. ఆదివారం మధ్యాహ్నం జ్యూస్ కోసమని బయటకు వెళ్లి.. గంట తర్వాత ఇంటికి వచ్చి చూడగా.. సోదరుడు, అమ్మ హత్యకు గురి కావడంతో షాక్ తిన్న కాజల్ పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అక్కడ పరిస్థితి చూడగా.. ఇల్లంతా చిందర వందరగా చేసి ఉంది. కాజల్ ను ప్రశ్నించగా.. తాను బయటకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి.. అమ్మ మీనా మృతదేహం మంచంపై కనిపించిందని, తమ్ముడు రాహుల్ డ్రాయింగ్ రూంలో అనిశ్చితి స్థితిలో చూశానని పేర్కొంది. ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడ్డాయని, ఎవరో వీరిద్దరిని హత్య చేసి నగలు ఎత్తుకెళ్లారంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ మృతదేహాలను పోలీసులు పరిశీలించగా.. 7-8 గంటల క్రితమే చనిపోయినట్లు గుర్తించారు. దీంతో కాజల్ ఏదో దాస్తుంది అని అనుమానం వ్యక్తం చేశారు.

ఈ డబుల్ మర్డర్ హర్యానాలోని యమునా నగర్‌లో చోటుచేసుకుంది. స్థానికంగా ఈ హత్య కలకలం రేపింది. ఆజాద్‌నగర్‌లోని వీధి నంబర్‌ 2లో నివాసముంటుంది మీనా కుటుంబం. కూతురు కాజల్, కొడుకు రాహుల్‌తో కలిసి ఉటుంది. ఆదివారం తల్లీ, కొడుకులు హత్యకు గురికావడంతో పోలీసులు ఈ కేసు విచారణ చేపట్టారు. తొలుత ఇది ఎవరో చేసిన హత్యగా భావించగా.. కూతురు పొంతన లేని సమాధానాలు చెప్పడం, మృతదేహాలు ఎప్పుడో చనిపోయి కనిపించడం, ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ మిస్ కావడం, కాజల్ కంటి నుండి కన్నీరు చుక్క లేకపోవడంతో ఆమెను అనుమానించారు పోలీసులు. తమదైన స్టైల్లో విచారించగా.. అసలు విషయం వెలుగు చూసింది. కూతురే తల్లి, సోదరుడ్ని పొట్టన పెట్టుకుంది. ఆమెకు సహకరించాడు.. బావ వరుసయ్యే వ్యక్తి.

కూతురే తల్లిని చంపి.. నాటకం ఆడిందని తెలిసి అవాక్కయ్యారు స్థానికులు. కాగా, ఆమె ఇద్దర్ని పొట్టనబెట్టుకోవడానికి కారణాలు తెలిసి పోలీసులు సైతం ఖంగుతిన్నారు. కాజల్ చిన్నప్పటి నుండి టామ్ బాయ్‌లా పెరిగింది.అబ్బాయిలా ఫ్యాంట్ అండ్ షర్ట్ ధరించేది. అబ్బాయిలానే ప్రవర్తించేది. ఆడ పిల్లలా వందనంగా ఉండాలని తల్లి మందలించేంది. ఈ విషయంపై తల్లీ, సోదరుడితో నిత్యం గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ గొడవలతో విసుగుపోయిన కాజల్.. తల్లినీ, సోదరుడ్ని చంపేయాలనుకుంది. అందుకు అప్పటికే ఆస్తి విషయంలో విబేధాలు ఉన్న మేనమామ కొడుకు సాయం కోరింది. ఇద్దరు కలిసి ఆదివారం తొలుత తల్లి మీనా తలపై కొట్టి.. ఆ తర్వాత గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత రాహుల్‌ను కూడా ఇదే తరహాలో హత్య చేశారు. కాజల్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో నిందితుడ్ని పట్టుకుని పనిలో ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి