iDreamPost
android-app
ios-app

తమ్ముడికి అందమైన భార్య వచ్చింది! అన్న తట్టుకోలేక ఏమి చేశాడంటే?

  • Published May 24, 2024 | 1:47 PM Updated Updated May 24, 2024 | 1:47 PM

తనకు పెళ్లి కాకుండా తమ్ముడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడన్న అక్కసు పెంచుకున్నాడు అన్నయ్య. అతడి మరదలు చాలా అందగత్తె. తమ్ముడు, అతడి భార్యకు ఓ బాబు కూడా పుట్టాడు. అందరూ కలిసే ఉంటున్నారు. అయితే..

తనకు పెళ్లి కాకుండా తమ్ముడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడన్న అక్కసు పెంచుకున్నాడు అన్నయ్య. అతడి మరదలు చాలా అందగత్తె. తమ్ముడు, అతడి భార్యకు ఓ బాబు కూడా పుట్టాడు. అందరూ కలిసే ఉంటున్నారు. అయితే..

  • Published May 24, 2024 | 1:47 PMUpdated May 24, 2024 | 1:47 PM
తమ్ముడికి  అందమైన భార్య వచ్చింది! అన్న తట్టుకోలేక ఏమి చేశాడంటే?

దేశం అభివృద్ధి చెందుతున్నా.. శాస్త్ర, సాంకేతికంగా ముందుకు సాగుతున్నా కులం, మతం కోట్లాటలు ఆగడం లేదు. ఇవే ప్రేమకు అడ్డుగా మారాయి. కులాలు, మతాల గోడలు తెంచేసి కొంత మంది తమ ప్రేమను దక్కించుకుంటున్నారు. కానీ వీరిపై పగ పెంచుకుంటున్నారు కుటుంబ సభ్యులు. వారి అందమైన జీవితాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు కాలరాజేస్తున్నారు. దేశంలో ఏదో ఒక మూల పరువు హత్యలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హర్యానాలోని సోనిపట్‌లో ఇలాంటి హత్యే చోటుచేసుకుంది. తమను కాదని, తనకు పెళ్లికాకుండా తమ్ముడు.. ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని అక్కసు పెంచుకున్న అన్న దారుణానికి ఒడిగట్టాడు. సొంత తమ్ముడు, మరదలు, అతడి కొడుకును హత్య చేశాడు. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపుతోంది.

సోనిపట్‌లోని రాయ్ ప్రాంతంలోని బింద్రౌలీ గ్రామంలో కులాంతర వివాహం చేసుకున్నందుకు కోపంతో అన్నయ్య పదునైన ఆయుధంతో తమ్ముడు, అతని భార్య , బిడ్డల్ని చంపేశాడు. వివరాల్లోకి వెళితే.. ధరంబీర్ అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు మన్‌దీప్‌, అమర్‌దీప్‌ (28), ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలకు పెళ్లి చేసి పంపించేశాడు. కాగా, అతడి చిన్న కుమారుడు అమర్‌దీప్ సోనిపట్‌లోని అదనపు డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలోని మానవ సమాచార మరియు వనరుల శాఖలో పనిచేస్తున్నాడు. అమర్.. భైంస్వాల్ కలాన్ గ్రామానికి చెందిన మధు(25)తో పరిచయం ఏర్పడి.. ప్రేమగా మారింది. వీరిద్దరి వేర్వేరు కులాలు కావడంతో వీరి ప్రేమను తొలుత పెద్దలు అడ్డుచెప్పారు. ఆ తర్వాత ఒప్పుకోవడంతో మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. కాగా, అన్న మన్ దీప్‌కు ఈ వివాహం ఇష్టం లేదు. అతడి భార్య అందంగా ఉండటంతో పాటు.. తాను పెళ్లి చేసుకోకుండా తమ్ముడు వివాహం చేసుకోవడంతో సహించలేకపోయాడు.

కాగా, అమర్-మధులకు కొడుకు పుట్టగా.. శివమ్ అని పేరు పెట్టుకున్నాడు. కాగా, వీరిద్దరి లవ్ మ్యారేజ్ విషయంలో తరచు గొడవలు జరుగుతున్నాయి. ఈ బుధవార రాత్రి అమర్ దీప్ తన భార్య,  కుమారుడితో కలిసి ఇంటి ఆవరణలో మంచంపై పడుకున్నాడు. తెల్లారే నిద్ర లేచిన ధరంబీర్.. తన మనవడితో కాసేపు ఆడుకుని బయటకు వెళ్లాడు. అంతలో ఇంట్లో నుండి కేకలు వినిపించాయి. ఇంటి వైపు పరుగులు పెట్టేసరికి పెద్ద కొడుకు మన్ దీప్ బైక్ పై ఇంటి నుండి పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెళుతూ వెళుతూ.. అమర్ దీప్, మధు, శివమ్ లను తానే హత్యచేశానని బిగ్గరగా అరుచుకుంటూ వెళ్లిపోయాడు. ఎవరికైనా చెబితే.. తండ్రి అని కూడా చూడకుండా చంపేస్తానంటూ బెదిరించాడు. అయితే తండ్రి ఇచ్చిన ఫిర్యాదులో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మంచంపై అమద్ దీప్ మృతదేహం కనిపించింది. కోడలు మధు మృతదేహం గదిలో ఉంది. మనవడు గాయపడగా.. ఆసుపత్రికి తీసుకెళ్లాడు ధరంబీర్. అయితే చనిపోయినట్లు నిర్దారించారు వైద్యులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు పోలీసులు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabet