iDreamPost
android-app
ios-app

అందమైన భార్య.. అయినా ఆ భర్త బుద్ధి మార్చుకోకపోవడంతో..

పెళ్లై 8 ఏళ్లు. అందమైన భార్య ఉంది. కానీ ఆ విషయంలో కక్కుర్తి పడ్డాడు భర్త. రోజూ ఆమెతో గొడవపడేవాడు. చివరకు ఓ రోజు అదే విషయంపై తగాదా పెట్టుకున్నాడు. చివరకు

పెళ్లై 8 ఏళ్లు. అందమైన భార్య ఉంది. కానీ ఆ విషయంలో కక్కుర్తి పడ్డాడు భర్త. రోజూ ఆమెతో గొడవపడేవాడు. చివరకు ఓ రోజు అదే విషయంపై తగాదా పెట్టుకున్నాడు. చివరకు

అందమైన భార్య.. అయినా ఆ భర్త బుద్ధి మార్చుకోకపోవడంతో..

వ్యసనం మనిషి జీవితాన్ని పాడుచేయడమే కాకుండా కుటుంబాలను కూడా నాశనం చేస్తుందని అంటారు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు మన కళ్ల ముందు చోటుచేసుకున్నాయి. కొంత మందికి అనుభవాలుగా, జీవితం నేర్పిన పాఠాలుగా మిగిలిపోయాయి. వీరిని చూసి కూడా మరొకరు మారుతారు అనుకుంటే పొరపాటు.. ఎవరి లైఫ్ వారిది అనుకుంటూ లైట్ తీసుకుంటున్నారు. మళ్లీ ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. భర్త వ్యసనం పూజను కూడా బలితీసుకుంది. ఇంతకు ఆమె ఎవరు అనుకుంటున్నారు. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయే ఈ పూజ. ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు భర్త. ఎందుకు అనుకుంటున్నారా… అయితే ఇది చదవండి.

అందమైన భార్య ఉన్నప్పటికీ.. అంతకంటే అందమైన డబ్బు కోసం ఆమెను హత్య చేశాడు మగడు. మద్యానికి బానిసై.. డబ్బుల కోసం నిత్యం వేధించి.. చివరకు ఒక్కసారే ప్రాణాలు తీసుకున్నాడు కసాయి భర్త. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పానిపట్‌లోని చుల్కానా గ్రామానికి చెందిన నవీన్ అలియాస్ జానీతో ఎనిమిదేళ్ల క్రితం పూజకు పెళ్లైంది. పెళ్లి సమయంలో ఆమెకు కట్నకానులకు ఇచ్చి పెళ్లి చేశారు. అతడు ఇనుప బట్టీలో పనిచేసేవాడు. కానీ పెళ్లైన నాటి నుండి ఆమెను మరింత కష్టం తీసుకురావాలి అంటూ వేధించేవాడు. మద్యానికి బానిసై.. ఆమె పట్ల ఘోరంగా వ్యవహరించేవాడు. ఆమెను కొట్టేవాడు, తిట్టేవాడు. అలాగే సహించేది, భరించేది భార్య.

తాజాగా పీకలదాకా తాగి వచ్చిన నవీన్ .. మరోసారి ఆమెతో గొడవ పడ్డాడు. అనంతరం పక్కనే ఉన్న కర్రతో ఆమె తలపై కొట్టి చంపాడు. దీంతో రక్తం కారుతూ మంచంపై పడిపోయిన భార్యను చూసి.. అక్కడి ననుండి పారిపోయాడు. కుటుంబం మొత్తం వెళ్లిపోయింది. అయితే స్థానికులు ఆమె మృతదేహాన్ని చూసి అటు పోలీసులకు, ఇటు మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కూతుర్ని చూసి ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. పూజా సోదరుడు శ్రవణ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ మొత్తం ఘటనలో పూజా భర్త, బావ, అత్తగారు, అత్తమామల ప్రమేయం ఉందని చెప్పాడు.  పోలీసులు నవీన్‌ , అతని తండ్రి జగదీష్‌, ఇద్దరు సోదరులు బైందర్‌, అజయ్‌లపై హత్య సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడైన భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి