iDreamPost
android-app
ios-app

ఆ ప్రైవేట్ ట్రావెల్స్‌లో యువతిపై డ్రైవర్ అత్యాచారం!

  • Published Jul 30, 2024 | 2:29 PM Updated Updated Jul 30, 2024 | 2:29 PM

నానాటికి ఆడపిల్లకు రక్షణ కొరవడింది. కొత్త చట్టాలు తెచ్చినా.. కఠినమైన శిక్షలు తీసుకు వస్తున్నా కామాంధులను ఏమీ చేయలేకపోతున్నాయి. తాజాగా ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో యువతిపై దారుణం చోటుచేసుకుంది.

నానాటికి ఆడపిల్లకు రక్షణ కొరవడింది. కొత్త చట్టాలు తెచ్చినా.. కఠినమైన శిక్షలు తీసుకు వస్తున్నా కామాంధులను ఏమీ చేయలేకపోతున్నాయి. తాజాగా ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో యువతిపై దారుణం చోటుచేసుకుంది.

  • Published Jul 30, 2024 | 2:29 PMUpdated Jul 30, 2024 | 2:29 PM
ఆ ప్రైవేట్ ట్రావెల్స్‌లో యువతిపై డ్రైవర్ అత్యాచారం!

కామాంధుల చేతుల్లో ఆడపిల్లల బతుకులు బుగ్గిపాలు అవుతున్నాయి. ఇంటా, పని ప్రదేశాల్లోనే కాదు ప్రయాణ సమయాల్లో కూడా వీరిపై అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయి. దేశంలోనే సంచలనం కలిగించిన నిర్భయ ఘటన కూడా బస్సులో మానవ మృగాల కామమాంఛకు బలైన ఓ అబల కథే. అత్యంత ఘోరంగా కదులుతున్న బస్సులో అత్యాచారం చేశారు. పశువు కన్నా దారుణంగా, ఘోరంగా ఆమెపై వాంఛ తీర్చుకున్నారు. దీంతో తీవ్రగాయలతో పోరాడుతూ ఆమె మరణించింది. ఆ తర్వాత నిర్భయ చట్టం వచ్చింది. అభయ, దిశ వంటి చట్టాలు కూడా ఇలాంటి దుర్ఘటనల నుండి పుట్టుకొచ్చిన చట్టాలే. కానీ చట్టాలు వస్తున్నాయి కానీ కామాంధుల్లో మాత్రం మార్పులు చోటుచేసుకోవడం లేదు. తాజాగా ఓ ప్రైవేట్ బస్సులో యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు డ్రైవర్.

ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకోవడం.. మరింత చర్చకు దారి తీసింది. కదులుతున్న బస్సులోనే.. యువతి నోట్లో గుడ్డలు కుక్కి, నోరు మూసి అత్యాచారం చేశాడు కామాంధుడు. అయితే మిగిలిన ప్రయాణీకులు చూసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడితో సహా బస్సును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన ప్రైవేట్ బస్సు హరికృష్ణ ట్రావెల్స్‌లో చోటుచేసుకుంది. పోలీసులు బస్సును సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ నుండి ప్రకాశం జిల్లాకు వెళుతుంది హరి కృష్ణ ప్రైవేట్ ట్రావెల్ స్లీపర్ బస్సు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు వచ్చింది. ఇందులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. సిద్దయ్య డ్రైవ్ చేస్తుండగా.. మరొక డ్రైవర్ ఉన్నాడు. అయితే తెల్లవారు జామున ప్రయాణీకులంతా గాఢ నిద్రలో ఉండగా.. డ్రైవర్ మెల్లిగా యువతి వద్దకు వెళ్లి తన నోట్లో గుడ్డలు కుక్కాడు.

ప్రయాణీకులు ఉన్నారన్న భయం లేకుండా ఓ యువతిపై అత్యాచారం చేశాడు. ఆమె ప్రతిఘటించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరకు ఆమె చేసిన శబ్దాలకు తోటి ప్రయాణీకులు లేచి చూడగా అప్పటికే ఘోరం జరిగిపోయింది. డ్రైవర్‪ను పట్టుకునే ప్రయత్నం చేయగా.. అప్పటికే అతడు అక్కడ నుండి పరారయ్యాడు. బాధితురాలు 100కు డయల్ చేసింది. బస్సును వెంబడించిన పోలీసులు పట్టుకున్నారు. యువతి ఇచ్చిన ఫిర్యాదులో కేసు నమోదు చేశారు. మరో డ్రైవర్ సిద్దయ్యను అదుపులోకి తీసుకుని బస్సును సీజ్ చేశారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు దొరికినట్లు తెలుస్తుంది.  ప్రస్తుతం ఈ ఘటన ప్రైవేట్ ట్రావెల్స్ జర్నీపై భయాందోళనలు తలెత్తుతున్నాయి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabet