iDreamPost
android-app
ios-app

తల్లి అక్రమ సంబంధాలు.. ఏకంగా నలుగురితో! చివరికి కూతురిపైన!

  • Published May 08, 2024 | 3:54 PM Updated Updated May 08, 2024 | 3:54 PM

తాను చనిపోతానేమోనన్న భయంతో కూతురికి పెళ్లి చేసింది తల్లి. కూతురి అన్యోన్యమైన దాంపత్యాన్ని చూసి మురిసిపోయింది. అత్తారింటికి వెళ్లిన కూతురు... తల్లిని చూద్దామని పుట్టింటికి వెళ్లింది. కానీ

తాను చనిపోతానేమోనన్న భయంతో కూతురికి పెళ్లి చేసింది తల్లి. కూతురి అన్యోన్యమైన దాంపత్యాన్ని చూసి మురిసిపోయింది. అత్తారింటికి వెళ్లిన కూతురు... తల్లిని చూద్దామని పుట్టింటికి వెళ్లింది. కానీ

  • Published May 08, 2024 | 3:54 PMUpdated May 08, 2024 | 3:54 PM
తల్లి అక్రమ సంబంధాలు.. ఏకంగా నలుగురితో! చివరికి  కూతురిపైన!

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు తల్లీ కూతుళ్లు చంపాదేవీ, జ్యోతి. జ్యోతికి ఆరు నెలల క్రితమే పెళ్లి చేసింది. సంసారం హాయిగా సాగిపోతుంది. తనను ప్రేమించే భర్త దొరికాడని మురిసిపోయింది ఇల్లాలు. అల్లుడు కూడా కూతుర్ని బాగా చూసుకోవడంతో ఆనందంలో మునిగిపోయింది తల్లి. ఈ క్రమంలో అప్పుడప్పుడు  అమ్మ చంపాదేవీని చూసేందుకు జ్యోతి కూడా తల్లి ఇంటికి వెళ్లేది. కానీ ఈసారి పుట్టింటికి వెళ్లిన జ్యోతి.. ఇక అత్తారింటికి తిరిగి వెళ్లలేదు. పుట్టింట్లోనే అమ్మ కళ్ల ముందే హత్యకు గురైంది. తల్లి మాజీ ప్రియుడు ఆమెను పొట్టన బెట్టుకున్నాడు. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో నివసిస్తోంది చంపాదేవీ. ఆమె మొదటి భర్త చనిపోవడంతో, మరొకర్ని వివాహం చేసుకుంది. ప్రస్తుతం అతడు బీహార్ రాష్ట్రంలో ఉంటున్నాడు.  కాగా, తన కూతురు జ్యోతిని ఉత్తర ప్రదేశ్‌లోని ఇందిరాపురం ప్రాంతానికి చెందిన లలితేష్ అనే వ్యక్తికి ఇచ్చి ఆరు నెలల క్రితమే పెళ్లి చేసింది తల్లి. కాగా, చంపాదేవీ క్యాన్సర్ వ్యాధి బారిన పడింది. దీంతో అప్పుడప్పుడు తల్లిని చూసేందుకు వెళ్లేది కూతురు. అలా మంగళవారం తల్లి ఇంటికి భర్తతో కలిసి వెళ్లింది జ్యోతి. కాగా, ఆ సమయంలో బాబీ అనే వ్యక్తి చంపా దేవీపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో తల్లిని రక్షించేందుకు ప్రతిఘటించింది కూతురు. ఈ ఘటనలో జ్యోతి చనిపోగా, లలితేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ గొడవ జరిగినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు పరుగులు తీసింది చంపాదేవీ.

ఇంటికి వచ్చి చూసే సరికి రక్తపు మడుగుల్లో కూతురు చనిపోయే సరికి కన్నీరుమున్నీరు అయ్యింది. కాగా, తల్లి మాజీ ప్రియుడే కూతుర్ని పొట్టనబెట్టుకున్నాడు. చంపాదేవీకి బాబీకి గతంలో అక్రమ సంబంధం ఉండగా, ప్రియుడు జైలుకు వెళ్లాక.. అజయ్ అనే వ్యక్తితో చంపాదేవీ వివాహేతర సంబంధం పెట్టుకుంది. మరొకరితో అక్రమ సంబంధం నెరుపుతుందని తెలుసుకున్న బాబీ.. చంపాదేవీపై కక్ష గట్టి ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఓ కేసులో జైలు కెళ్లిన బాబీ.. గౌతమ్ బుద్దా నగర్ జైలు నుండి 15 రోజుల క్రితమే విడుదలయ్యాడు. తొలుత అజయ్‌కు ఫోన్ చేసి ఆమెను బెదిరించాడు. అనంతరం చంపాదేవీ నివాసానికి మరొక వ్యక్తితో కలిసి వెళ్లిన బాబీ.. కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో తల్లిపై దాడిని అడ్డుకునేందుకు కూతురు ప్రయత్నించే క్రమంలో ప్రాణాలు పోగొట్టుకుంది. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabet