iDreamPost
android-app
ios-app

ఏలూరులో దారుణం! ప్రేమంటూ వెంటబడ్డాడు.. నో చెప్పినందుకు నరికి చంపాడు!

  • Published May 30, 2024 | 3:54 PM Updated Updated May 30, 2024 | 3:54 PM

ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది కానీ.. చావును కాదు అని ఓ మూవీలో డైలాగ్ ఉంది. కానీ రివర్స్ లో ఫాలో అవుతున్నారు లవర్స్. తమకు దక్కనిది మరెవ్వరికీ దక్కకూడదన్న అక్కసుతో ప్రేయసిపై కక్ష కడుతున్నాడు ప్రియుడు

ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది కానీ.. చావును కాదు అని ఓ మూవీలో డైలాగ్ ఉంది. కానీ రివర్స్ లో ఫాలో అవుతున్నారు లవర్స్. తమకు దక్కనిది మరెవ్వరికీ దక్కకూడదన్న అక్కసుతో ప్రేయసిపై కక్ష కడుతున్నాడు ప్రియుడు

  • Published May 30, 2024 | 3:54 PMUpdated May 30, 2024 | 3:54 PM
ఏలూరులో దారుణం! ప్రేమంటూ వెంటబడ్డాడు.. నో చెప్పినందుకు నరికి చంపాడు!

ప్రేమ మత్తులో యువత తప్పుదోవ పడుతున్నారు. ప్రేయసికి తన లవ్ ప్రపోజల్ చెబితే.. ఒప్పుకుంటే సరే సరి.. కాదంటే మాత్రం కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొంత మంది అబ్బాయిలు లైట్ తీసుకుంటున్నారు. కానీ మరికొందరు సైకోల్లా ప్రవర్తిస్తూ.. వారిని నిత్యం లవ్ చేయ్ అంటూ వేధించడం, వెంబడి పడటం చేస్తుంటారు.  ప్రేమించట్లేదని ప్రేయసి చెబితే.. తనకు దక్కని అమ్మాయి మరెవ్వరికీ దక్కకూడదన్న ఉద్దేశంతో చంపేందుకు కూడా వెనుకాడటం లేదు. తాజాగా ఓ ప్రేమోన్మాది.. తాను ప్రేమించిన అమ్మాయి.. తన లవ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయలేదని నడి రోడ్డుపై కత్తితో అతి కిరాతకంగా దాడి చేసి చంపి.. ఆ తర్వాత అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఏపీలోని ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికంగా కలవరపాటుకు గురి చేసింది.

ఏలూరు జిల్లాలోని సత్రంపాడులో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించలేదన్న కారణంతో ఓ యువతిని హత్య చేసి.. ఆపై అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు నగరంలోని ఎమ్మార్సీ కాలనీకి చెందిన జక్కుల రత్న గ్రేసీ(22) స్థానికంగా తల్లిదండ్రులతో కలిసి జీవిస్తుంది. తొట్టిబోయిన యేసురత్నం(23) అనే యువకుడు గత కొంత కాలంగా  ప్రేమించాలంటూ ఆమె వెంటపడుతున్నాడు. అయితే అతడి ప్రేమను తిరస్కరిస్తూ వస్తుంది యువతి. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం గ్రేసీని వెంబడించిన యేసు రత్నం.. తన వెంట తెచ్చుకున్న కత్తితో పలుమార్లు మెడపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. యేసు రత్నం కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.

 స్థానికులు గమనించి.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న యేసురత్నాన్ని ఆసుపత్రికి తరలించారు. కాగా, గ్రేసీ మరణించినట్లు నిర్ధారించుకున్నారు. ఆమె మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రేమోన్మాది యేసు రత్నం పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ ప్రస్తుతం వైరల్ అవుతుంది. దీని ఆధారంగా పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేశారు. యేసు రత్నం గతంలో ఇంటికి వచ్చి గ్రేసిని పెళ్లి చేసుకుంటానంటూ అడిగాడని.. దానికి తాము ఒప్పుకోలేదని యువతి తల్లిదండ్రులు తెలిపారు. దీంతో కక్షగట్టిన యేసురత్నం తన కూతురిపై ఈ దారుణానికి ఒడిగట్టాడని కన్నీరు మున్నీరు అవుతున్నారు గ్రేసీ పేరెంట్స్. మా అమ్మాయి జోలికి రాకుండా చూడాలని యువకుడి కుటుంబ సభ్యులకు కూడా చెప్పినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomfixbetcasibomfixbetcasibomfixbetcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet