iDreamPost
android-app
ios-app

నా లవర్‌కు మేసేజ్ చేస్తావా? ఆవేశంలో ఏమి చేసిందంటే?

  • Published Feb 22, 2024 | 6:16 PM Updated Updated Feb 22, 2024 | 6:16 PM

ప్రియుడు మరో అమ్మాయిని కన్నెత్తి చూసినా.. పన్నెత్తి పలకరించిన సహించదు ప్రియురాలు. అలాంటిది చాట్ చేస్తుందని తెలిస్తే ఊరుకుంటుందా.. కాళికగా మారదా.. ఇదే జరిగింది.

ప్రియుడు మరో అమ్మాయిని కన్నెత్తి చూసినా.. పన్నెత్తి పలకరించిన సహించదు ప్రియురాలు. అలాంటిది చాట్ చేస్తుందని తెలిస్తే ఊరుకుంటుందా.. కాళికగా మారదా.. ఇదే జరిగింది.

  • Published Feb 22, 2024 | 6:16 PMUpdated Feb 22, 2024 | 6:16 PM
నా లవర్‌కు మేసేజ్ చేస్తావా? ఆవేశంలో ఏమి చేసిందంటే?

ఇప్పుడు ప్రేమ కథలన్నీ ట్రయాంగిల్ బాట పడుతున్నాయి. ఇద్దరు అబ్బాయిలు ఒకే అమ్మాయిని ప్రేమించడం లేకుంటే.. ఇద్దరు అమ్మాయిలు ఒకే యువకుడ్ని లవ్ చేయడం. ఈ తరహా లవ్ స్టోరీస్ కారణంగా ముగ్గురు జీవితాలు ఇబ్బందులకు గురౌతున్నాయి. ప్రియుడు తనను కాకుండా మరో అమ్మాయిని కన్నెత్తి చూసినా సహించలేదు ప్రియురాలు.అలాంటిది పలకరిస్తే.. లేదా తనకు తెలియకుండా మేసెజెస్ చేస్తుంటే.. ఇక భరిస్తుందా.. లవర్‌కు తాట తీసేస్తుంది. అయితే ఇందులో అతడి తప్పు లేదని, మరో అమ్మాయే ఇలా వల వేస్తుందని తెలిస్తే.. ఊరుకుంటుందా.. అస్సలు ఊరు కోదు.. ప్రియుడి కోసం ఎంతటి దూరమైనా వెళుతుంది అనేందుకు ఈ సంఘటనే ఉదాహరణ.

ప్రియుడితో ఓ అమ్మాయి చాట్ చేస్తుందని తెలిసి.. ఏకంగా ఆమెను కిడ్నాప్ చేసిందో ప్రియురాలు. సినిమా స్టోరీని మించిపోయి ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా గోకవరం ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కొవ్వూరు గ్రామానికి చెందిన ఓ యువతి..ఓ అబ్బాయిని ప్రేమించింది. అయితే.. అతడికి ఇన్ స్టాలో ఓ మహిళ పరిచయమై.. రోజు మెసేజెస్ చేస్తుంది. ఇది గమనించిన ప్రియురాలు..తన లవర్‌తో చాట్ చేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది సదరు మహిళకు. అయినప్పటికీ గోకవరానికి చెందిన యువతిలో మార్పు రాలేదు. దీంతో ఆమెకు గట్టిగా బుద్ది చెప్పాలని భావించి.. తన స్నేహితుల సాయంతో కారులో గోకవరానికి వచ్చింది. కాపు కాసి.. సదరు మహిళను కిడ్నాప్ చేసింది.

మహిళను కొట్టి బలవంతంగా కారులో తీసుకెళ్లిపోయారు కిడ్నాపర్స్. అయితే ఈ ఘటనపై మహిళ భర్తకు విషయం చెప్పారు ఆమె  బంధువులు. వెంటనే భర్త పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి.. తన భార్యను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు స్పందించారు. టెక్నికల్ సాయంతో కారు ఎక్కడ ఉందో ట్రేస్ చేశారు. అనంతరం యువతి ఎక్కడ ఉందో ట్రాక్ చేసి.. కిడ్నాప్ చేసిన మహిళల్ని పట్టుకున్నారు. అరగంటలో కేసును చేధించారు పోలీసులు. వెంటనే కిడ్నాప్ చేసిన యువతితో పాటు ఆమెకు సహకరించిన ఇద్దరు అమ్మాయిల్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet girişjojobet giriş