Krishna Kowshik
నిజ జీవితాల ఆధారంగా సినిమాలు తీయడం వేరు. అయితే సినిమాలు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఆ హీరో వేసిన డ్రెస్సులే కాకుండా, ఫైట్స్, పాటలను చూసి ఫాలో అవుతుంటారు. అలాగే క్రూరత్వాన్ని కూడా ఒంటికి పట్టించుకుంటున్నారు.
నిజ జీవితాల ఆధారంగా సినిమాలు తీయడం వేరు. అయితే సినిమాలు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఆ హీరో వేసిన డ్రెస్సులే కాకుండా, ఫైట్స్, పాటలను చూసి ఫాలో అవుతుంటారు. అలాగే క్రూరత్వాన్ని కూడా ఒంటికి పట్టించుకుంటున్నారు.
Krishna Kowshik
జంతువుల కన్నా మనుషులు క్రూరంగా తయారవుతున్నారు. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డు అదుపు లేదు. కేవలం దేశంలోనే అనుకుంటే పొరపాటు.. ప్రపంచ వ్యాప్తంగా ఇదే ధోరణి కొనసాగుతుంది. ఎన్ని చట్టాలు చేసినా.. ఎన్ని రూల్స్ తెచ్చినా.. కించిత్ భయం కూడా ఉండటం లేదు మూర్ఖులకు. సామాన్య మహిళలే కాదూ సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్లపై కూడా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ మోడల్‌ను అత్యంత గుజుప్సాకర రీతిలో చంపేశారు. గర్భవతి అన్న కనికరం కూడా లేకుండా చంపి.. ఆమె మృతదేహాన్ని ఫ్రిజ్‌లో కుక్కారు. ఈ దారుణ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
అమెరికాలో లాస్ ఏంజెల్స్‌లో మెడల్ మలీసా మూనీ తన ఇంట్లోని రిఫ్రిజరేటర్‌లో శవమై కనిపించింది. ఈ ఘటన సెప్టెంబర్ 12న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొన్ని రోజుల నుండి ఆమె గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇంట్లో ఫ్రిజ్‌లో మృతదేహాన్ని గుర్తించారు. ఆమె నోటిని మసి, కాళ్లు, చేతులు కట్టేశారు. ఆమె డ్రగ్స్, మద్యం మత్తులో ఉండగా.. ఈ దారుణం ఉందని గుర్తించారు. అయితే ఇటీవల శవ పరీక్ష నివేదికలో మూనీని బంధించి, తీవ్రంగా కొట్టారని, కాళ్లు, చేతులు కట్టేసినట్లు తేలింది.
మోడల్ తల, ముఖం, వీపు, చేతిపై గాయాలున్నట్లు గుర్తించారు. అయితే ఆ కిరాతకుడు ఎవరన్నదీ పోలీసులు గుర్తించలేదు. అయితే ఆమె ఐఫోన్, మ్యాక్ బుక్ ను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసిందన్నారు. ఆమె దారుణంగా హత్యకు గురికావడం, మూనీ లేదన్న మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు..ఆమె సోదరి, మోడల్ అయిన జోర్డిన్ పౌలిన్ ఆవేదన వ్యక్తం చేశారు.