Krishna Kowshik
సానియా చాలా అందగత్తె. హీరోయిన్లు కూడా పనికిరారు అనే అందం ఆమెది. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో అమ్మమ్మ దగ్గరే పెరిగింది. చదువుకుంది. లాక్ డౌన్ సమయంలో ఆమెకు ఓ ఆటో డ్రైవర్ తో వివాహం చేశారు. కానీ
సానియా చాలా అందగత్తె. హీరోయిన్లు కూడా పనికిరారు అనే అందం ఆమెది. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో అమ్మమ్మ దగ్గరే పెరిగింది. చదువుకుంది. లాక్ డౌన్ సమయంలో ఆమెకు ఓ ఆటో డ్రైవర్ తో వివాహం చేశారు. కానీ
Krishna Kowshik
అనుమానం పెను భూతం అన్నారు పెద్దలు. ఇదే సంసారంలో నిప్పులు పోస్తుంది. భర్త మరొక స్త్రీతో నేరుగానే కాదు కదా.. ఫోనులో మాట్లాడిన సహించలేదు భార్య. అలాగే భార్య.. సొంత బంధువుల్లో అబ్బాయితో చనువుగా ఉన్నా.. అనుమానిస్తుంటాడు భర్త. ఈ అనుమానాల కొలమిలో కొట్టుకుపోయిన కాపురాలు ఎన్నో. అపార్థాలు, అవమానాలకు దారి తీసి చివరకు విడాకులు లేదా అఘాయిత్యాలకు కారణమౌతున్నాయి. తాజాగా సానియా ఖాన్ విషయంలో ఇదే చోటుచేసుకుంది. భార్యేమో అందగత్తె. అతడేమో ఆటో డ్రైవర్. ఇదే ఆమె పాలిట శాపమైంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెను హత్య చేసి.. ముక్కలుగా నరికి ఆటోలో తీసుకుని.. వివిధ ప్రాంతాల్లో పడేశాడు. ఒళ్లు గగొర్పొడిచేలా ఉన్న ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకుంది.
భార్యపై అనుమానంతో అత్యంత కిరాతకంగా చంపాడు ఓ భర్త. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతురాలు సానియా ఖాన్ తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో.. అమ్మమ్మ దగ్గర పెరిగింది. అక్కడే చదువుకుంది. 2020లో లాక్‌డౌన్ సమయంలో పెరెవాఖేడాలో నివసిస్తున్న నదీముద్దీన్ అనే ఆటోడ్రైవర్‌తో ఆమెకు వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కట్నం ఇచ్చారు. అయితే పెళ్లైన తర్వాత అతడు తాను కారు కొనుక్కోవాలంటూ డబ్బులు డిమాండ్ చేయడం ప్రారంభించాడు. దీంతో తరచుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్నాడు భర్త. మరో వ్యక్తితో ఆమెకు అక్రమ సంబంధం అంటగడుతూ.. దాడి చేయడం స్టార్ట్ చేశాడు.
ఆ పిచ్చి మరింత ముదిరింది. అతడు ఫోన్ చేసినప్పుడు బిజీ అని వచ్చినా.. ఆమె తన లవర్ తో మాట్లాడుతుందని భావించేవాడు. ఈ విషయంపై గొడవలు జరుగుతూ ఉండేవి. గత నెల 21న కూడా ఇదే విషయంపై భార్యా భర్తల మధ్య తగాదా మొదలైంది. ఈ క్రమంలో భార్య సానియా తలను నరికి.. ఆమె శరీరాన్ని 14 ముక్కులుగా కోసి.. వాటిని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి.. కాల్చేశాడు. మృతదేహం ఓ భాగం పూర్తిగా కాలకపోవడంతో తన ఇంట్లోనే పాతిపెట్టాడు కూడా. అయితే సానియా కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. అంతలో భర్త కనిపించకపోవడంతో అతడిపై అనుమానాలు మొదలయ్యాయి. అతడు పరారీలో ఉండగా.. చివరకు అతడ్ని పట్టుకుని విచారించారు పోలీసులు. చివరకు పొంతన లేని సమాధానాలు చెప్పాడు. గట్టిగా ప్రశ్నించే సరికి భార్యను తానే హత్య చేశానని నిజం ఒప్పుకున్నాడు. అనుమానంతోనే భార్యను హత్య చేసినట్లు చెప్పాడు నజీమ్. ప్రస్తుతం అతడ్ని అదుపులోకి తీసుకుని మరింత విచారణ చేపడుతున్నారు.