iDreamPost
android-app
ios-app

15 మంది అమ్మాయిలతో.. అమెరికాలో తెలుగోళ్ల పరువు తీశారు!

  • Published Jul 09, 2024 | 4:28 PM Updated Updated Jul 09, 2024 | 4:40 PM

ఇప్పటి వరకు అమెరికాలో తెలుగు వాళ్లకు భద్రత లేదు, రక్షణ లేదు అంటూ వాపోయారు. కానీ ఇప్పుడు నలుగురు ఇండియన్స్ ఓ తీవ్రమైన నేరారోపణలపై అరెస్ట్ అయ్యారు. అమెరికాలో తెలుగోళ్ల పరువు తీశారు. 15 మంది అమ్మాయిలతో..

ఇప్పటి వరకు అమెరికాలో తెలుగు వాళ్లకు భద్రత లేదు, రక్షణ లేదు అంటూ వాపోయారు. కానీ ఇప్పుడు నలుగురు ఇండియన్స్ ఓ తీవ్రమైన నేరారోపణలపై అరెస్ట్ అయ్యారు. అమెరికాలో తెలుగోళ్ల పరువు తీశారు. 15 మంది అమ్మాయిలతో..

  • Published Jul 09, 2024 | 4:28 PMUpdated Jul 09, 2024 | 4:40 PM
15 మంది అమ్మాయిలతో.. అమెరికాలో తెలుగోళ్ల పరువు తీశారు!

అమెరికాలో తెలుగు వాళ్లకు రక్షణ లేదంటూ ఇప్పటి వరకు గగ్గోలు పెడుతున్న సమయంలో షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. మానవ అక్రమ రవాణాకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయారు నలుగురు తెలుగు వ్యక్తులు.  అమెరికాలో తెలుగోళ్ల పరువు తీశారు. 15 మంది అమ్మాయిలు ఓ గదిలో నేలపై పడి ఉండటాన్ని గుర్తించారు స్థానిక పోలీసులు. భార్యా భర్తలతో పాటు మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన టెక్సాస్ రాష్ట్రం గిన్స్ బర్గ్ లేన్‌లోని 1000వ బ్లాక్‌లో జరిగింది. ఉద్యోగం, ఉపాధి కోసం అమెరికా వెళ్లిన కొంత మంది యువతుల్ని తమ షెల్ కంపెనీల్లో జాబ్స్ ఇస్తామని మభ్య పెట్టారు. అక్కడకు వెళ్లాక నిర్బంధించి తక్కువ జీతానికి పని చేయించుకున్నారు. ఈ విషయం ఫెస్ట్ కంట్రోల్ చేసేందుకు వెళ్లిన ఉద్యోగులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఓ ఇంటికి ఫెస్ట్ కంట్రోల్ చేసేందుకు వెళ్లగా.. అక్కడ అమ్మాయిలు ఉండటం చూసి అనుమానం వచ్చి.. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ప్రిన్స్ టన్ పోలీసులు సోదాలు నిర్వహించడంతో 15 మంది యువతులను గుర్తించారు. నిందితులు సంతోష్ కట్కూరీ, ఆయన భార్య ద్వారక గుండా, చందన్ దాసి రెడ్డి, అనిల్ మాలెలను అరెస్టు చేశారు. వీరంతా ఇండియన్స్, తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారుు. సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్స్, ప్రింటర్స్, ఇతర కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మార్చి 13న ఈ ఘటన జరగ్గా.. తాజాగా ఈ న్యూస్ వెలుగు చూసింది. ఇదిలా ఉంటే.. ఈ ముఠా గుట్టురట్టుతో మెలిస్సా, మిక్ కెన్నీ వంటి నగరంల్లో కూడా అమ్మాయిల అక్రమ రవాణాకు పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు.

ఆయా ప్రాంతాల్లో కూడా లాప్ టాప్స్, సెల్ ఫోన్, ప్రింటర్స్, ఫేక్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. సంతోష్, ద్వారకా నకిలీ కంపెనీలు ఏర్పాటు చేసి ఉద్యోగాల పేరిట  యువతుల్ని, అబ్బాయిలను మభ్య పెట్టారని తెలుస్తుంది. ఉద్యోగంలో చేరాక.. వారితో వెట్టి చాకిరీ చేయించుకున్నారు. గృహంలో నిర్భంధించి.. పనిచేయించుకున్నారు. డల్లాస్ కేంద్రంగా ఇదంతా జరుగుతుందని తెలుస్తోంది. ఓ భారత ఏజెన్సీలో నలుగురు తమతో బలవంతంగా పని చేయిస్తున్నారని బాధితులు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో నలుగుర్ని అదుపులోకి తీసుకుని..హ్యూమన్‌ ట్రాఫికింగ్‌, గృహ నిర్బంధం తో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ప్రిన్స్ టన్ పోలీసులు. గతంలో హ్యూమన్ ట్రాఫికింగ్‌ చేస్తున్నారన్న ఆరోపణలపై సత్తారు వెంకటేష్ రెడ్డి అనే తెలుగు వ్యక్తిని అమెరికాలో సెయింట్ లూయిస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet