iDreamPost
android-app
ios-app

మనిషి కాదు మృగం.. బాలికపై పగబట్టి

  • Published Jul 07, 2024 | 2:45 PM Updated Updated Jul 07, 2024 | 2:52 PM

ఆ అమ్మాయి తొమ్మిదో తరగతి చదువుతుంది. అందంగా ఉంటుంది. ఆమెపై మనసు పడ్డాడు సురేశ్. బాలిక వెంట పడటం స్టార్ట్ చేశాడు. దీంతో భయపడ్డ బాలిక.. తల్లిదండ్రులకు మేటర్ చెప్పింది. కానీ..

ఆ అమ్మాయి తొమ్మిదో తరగతి చదువుతుంది. అందంగా ఉంటుంది. ఆమెపై మనసు పడ్డాడు సురేశ్. బాలిక వెంట పడటం స్టార్ట్ చేశాడు. దీంతో భయపడ్డ బాలిక.. తల్లిదండ్రులకు మేటర్ చెప్పింది. కానీ..

  • Published Jul 07, 2024 | 2:45 PMUpdated Jul 07, 2024 | 2:52 PM
మనిషి కాదు మృగం.. బాలికపై పగబట్టి

పోక్సో, దిశ, నిర్భయ, అభయ లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా బాలికలు, యువతులు, మహిళలకు రక్షణ ఉండటం లేదు.  ఇంటా, బయటా ఎక్కడా ఆమె మాన, ప్రాణాలకు హామీ లేకుండా పోయింది. ప్రేమ, కామ పిశాచాలకు ఎంతో మంది మగువలు బలైపోతున్నారు. ముఖ్యంగా  యువతులు. ప్రేమించడం లేదని, ప్రేమను ఒప్పుకోలేదన్న అక్కసుతో పగబట్టి ప్రాణాలు తీస్తున్నారు ప్రియుడు. తనకు దక్కనిది మరొకరికి  దక్కకూడదని,  తనను కాదన్నదన్న అక్కసుతో బలిగొంటున్నారు. పెద్దలు చెప్పినాక, పోలీసులకు ఫిర్యాదు చేసినా..  కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు మానవ రూపంలో ఉన్న కొంత మంది మృగాళ్లు.

తాజాగా ఓ ప్రేమోన్మాది చేతిలో బలైంది ఓ మైనర్ బాలిక. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకా పల్లి జిల్లాలో చోటుచేసుకుంది.  ప్రేమించు అంటూ వెంటపడుతున్నాడు. అయితే పలుమార్లు చెప్పినప్పటికీ అతడి బుద్ది మారలేదు. దీంతో భయం వేసి కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. వీరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడ్ని అరెస్టు చేసి జైలుకు పంపారు. కానీ బెయిల్ పై వచ్చిన వచ్చిన అతడు ఆమెపై పగబట్టి.. కాపు కాచి.. హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాంబిల్లి మండలం కొప్పిగొండుపాలెంలోని నివస్తోంది బద్ది దర్శిని కుటుంబం.   ప్రస్తుతం 9వ తరగతి చదువుతుంది. కశింకోట మండలానికి చెందిన జె.సురేశ్‌ ఆమెను ప్రేమించు అంటూ నిత్యం వేధించేవాడు.

సురేశ్‌ ప్రవర్తనతో విసిగివేశారి పోయిన దర్శిని తల్లిదండ్రులకు చెప్పడంతో ఫిర్యాదు చేశారు.  అతడి పై పోక్సో కేసు నమోదు చేసి జైలుకి పంపారు. అయితే బెయిల్ పై బయటకు వచ్చిన సురేశ్.. తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని దర్శినీపై పగపెంచుకున్నాడు. రోజులానే స్కూల్ నుండి ఇంటికి వచ్చింది దర్శిని. నాన్నమ్మ  కాంతం ఇంటికి వెళ్లి తాళాలు తీసుకుని.. తన ఇంటికి వెళ్లింది. కాపు కాచిన సురేశ్…ఆమె ఇంట్లోకి వెళ్లి.. వేటకొడవలితో బాలిక మెడ నరికి హత్య చేశాడు. దీంతో అక్కడిక్కడే మరణించింది దర్శిని. అంతలో నాన్నమ్మ మనవరాలి దగ్గరకు వెళ్లింది. తలుపు తట్టగా తీయలేదు.  అనంతరం కాస్త గట్టిగా కొట్టే సరికి ఇంట్లో నుండి సురేశ్ వచ్చాడు. ఆమెను తోసేసి పారిపోయాడు. ఇంట్లోకెళ్లి చూడగా మనవరాలు రక్తపు మడుగుల్లో పడి ఉంది. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు సురేశ్ కోసం గాలిస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom