iDreamPost
android-app
ios-app

భూపాలపల్లిలో విషాదం.. కరెంట్ షాక్‌తో కానిస్టేబుల్‌ మృతి!

  • Published Feb 12, 2024 | 11:47 AM Updated Updated Feb 12, 2024 | 11:47 AM

భూపాలపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. ఓ కానిస్టేబుల్ విద్యుత్ షాక్ తో ప్రాణాలు కోల్పోయారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్ వెళ్లిన కానిస్టేబుల్ ను కరెంట్ రూపంలో మృత్యువు వెంటాడింది.

భూపాలపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. ఓ కానిస్టేబుల్ విద్యుత్ షాక్ తో ప్రాణాలు కోల్పోయారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్ వెళ్లిన కానిస్టేబుల్ ను కరెంట్ రూపంలో మృత్యువు వెంటాడింది.

భూపాలపల్లిలో విషాదం.. కరెంట్ షాక్‌తో కానిస్టేబుల్‌ మృతి!

ఎంతో భవిష్యత్ ఉన్న ఓ కానిస్టేబుల్ కరెంట్ షాక్ తో ప్రాణాలు కోల్పోయారు. అనుమానితులను పట్టుకునేందుకు అటవీ ప్రాంతంలో కూంబింగ్ వెళ్లిన కానిస్టేబుల్ ను కరెంట్ రూపంలో మృత్యువు వెంటాడింది. ఈ విషాద ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. మృతి చెందిన కానస్టేబుల్ ను ప్రవీణ్ గా గుర్తించారు. అసలు ఏం జరిగిందంటే.. కాటారం మండలం నస్తుర్‌పల్లి అటవీ ప్రాంతంలో అనుమానితులు సంచరిస్తున్నారనే సమాచారం స్థానిక పోలీసులకు అందింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా అదివరకే ఆ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడేందుకు వేటగాళ్లు కరెంటు వైర్లను ఏర్పాటు చేశారు.

పోలీసులు కూంబింగ్ చేస్తున్న సమయంలో చూసుకోకుండా ప్రమాదవశాత్తు కరెంటు తీగలు పట్టుకోవడంతో కానిస్టేబుల్‌ ప్రవీణ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తోటి సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. విద్యుదాఘాతంతో కానిస్టేబుల్‌ ప్రవీణ్‌ మృతిచెందడం పట్ల సీఎం రేవంత్‌ సంతాపం వ్యక్తం చేశారు. వన్యప్రాణులను వేటాడేందుకు కరెంటు తీగలను పెట్టిన వేటగాళ్లను గుర్తించి పట్టుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.