iDreamPost

CI కొడుకు ర్యాష్‌ డ్రైవింగ్‌.. స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయిన మహిళ!

ఆ మహిళ రోడ్డుపై భర్త బైకు దగ్గర నిల్చుని ఉంది. బైకు ఎక్కడానికి బ్యాగు సర్థుకుంటూ ఉంది. సీఐ కుమారుడు కారును వేగంగా నడుపుతూ వచ్చాడు. రోడ్డుపై ఉన్న సదరు మహిళను ఢీకొట్టాడు...

ఆ మహిళ రోడ్డుపై భర్త బైకు దగ్గర నిల్చుని ఉంది. బైకు ఎక్కడానికి బ్యాగు సర్థుకుంటూ ఉంది. సీఐ కుమారుడు కారును వేగంగా నడుపుతూ వచ్చాడు. రోడ్డుపై ఉన్న సదరు మహిళను ఢీకొట్టాడు...

CI కొడుకు ర్యాష్‌ డ్రైవింగ్‌.. స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయిన మహిళ!

ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి. కొంతమంది ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా ఇతరులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ప్రతీ రోజూ ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా దేశంలో ఎక్కడో చోట ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారు. ముఖ్యంగా హైవేలపై ర్యాష్‌ డ్రైవింగ్‌ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా, సీఐ కుమారుడి ర్యాష్‌ డ్రైవింగ్‌ కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అతడు నడుపుతున్న కారు వేగంగా వచ్చి ఆమెను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది.

ఈ సంఘటన తెలంగాణలోని హన్మకొండలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హన్మకొండ జిల్లాలోని కాజీపేట కేంద్రంలో సెయింట్‌ గ్యాబ్రియల్‌ స్కూల్‌ ఉంది. కవిత తన భర్తతో కలిసి ఆ స్కూలు ముందర బైకు దగ్గర నిలబడి ఉంది. ఆమె భర్త బైకుపై ఎక్కుతూ ఉంది. అదే సమయంలో వారి ముందు వైపునుంచి ఓ కారు వేగంగా వస్తూ ఉంది. కవిత తన హ్యాండ్‌ బ్యాగ్‌ సర్దుకుంటూ ఉంది. బైకు ఎక్కుదామనుకునేలోపే ఘోరం జరిగింది. ముందు నుంచి వచ్చిన కారు ఆమెను ఢీకొట్టింది.

దీంతో ఆమె ముందుకు ఎగిరిపడింది. ఈ హఠాత్పరిణామంతో భర్త కంగుతిన్నాడు. ఇంకెమీ ఆలోచించకుండా ఆమె వైపు పరుగులు తీశాడు. అయితే, అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. కారు ఢీకొన్న వేగానికి ఆమె గాల్లోకి ఎగిరి కిందపడ్డంతో తల బలంగా రోడ్డును తాకింది. తీవ్ర రక్తస్రావం అయి ఆమె చనిపోయింది. ఇక, ఈ ప్రమాదానికి కారణం అయింది సీఐ కుమారుడని తేలింది. అతడిపై చర్యలు తీసుకోవాలని కవిత కుటుంబసభ్యులు డిమాండ్‌ చేస్తూ ఉన్నారు.

సీఐ కుమారుడు కావటంతో పోలీసులు పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. పోలీసులు అంతా కలిసి నిందితుడ్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గురువారం నుంచి పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నామని, న్యాయం చేయడం లేదని ఆందోళన చేస్తున్నారు. ఫాతిమా నగర్‌ జంక్షన్‌ వద్ద ధర్నాకు సైతం దిగారు. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో దృశ్యాలు.. ప్రమాద తీవ్రతను కళ్లకు కడుతున్నాయి.

వైరల్‌గా మారిన ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఇలా ర్యాష్‌ డ్రైవ్‌ చేసి ప్రాణాలు తీసే వారికి జీవిత ఖైదు వేయాలి’’.. ‘‘ ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రమాదాలు బాగా పెరిగాయి. శిక్షలు మరింత కఠిన తరం చేయాలి’’.. ‘‘ తప్పు చేసింది ఎవరైనా సరే.. శిక్ష తప్పదు’’ అంటూ ఆ‍గ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి, ఈ విషాద సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి