Uppula Naresh
మటన్ పేరుతో పిల్లుల మాంసం అమ్మకం. వినటానికి షాకింగ్ ఉన్న ఇది నిజం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనంగా మరుతోంది. ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు..!
మటన్ పేరుతో పిల్లుల మాంసం అమ్మకం. వినటానికి షాకింగ్ ఉన్న ఇది నిజం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచలనంగా మరుతోంది. ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు..!
Uppula Naresh
ప్రపంచ దేశాల్లోని ప్రాంతాలను బట్టి ఆహారపు అలవాట్లు మారుతు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఆవు, ఎద్దు మాంసం తింటుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో పిల్లి వివిధ రకాల జంతువుల మాంసాలను తింటూ ఉంటారు. ఇలా ఎవరికి ఇష్టమొచ్చిన మాంసం వాళ్లు తినేందుకు ఇష్ట పడుతుంటారు. ఇదిలా ఉంటే.. చాలా ప్రాంతాల్లో మటన్ మాంసం పేరుతో ఆవు మాంసం అమ్ముతు చివరికి బయట పడుతుంటారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలా చోట్ల వెలుగు చూసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు అలాంటి వారిపై కేసులు నమోదు చేసి వారిని జైలుకు తరలిస్తుంటారు.
అయితే అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా చైనాలో చోటు చేసుకుంది. ఒక వాహనంలో ఏకంగా 1000 పిల్లులను కబేళాకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత వారిని విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. పిల్లుల మాంసాన్ని మటన్ మాంసం పేరుతో అక్కడి దేశంలోని దక్షిణ ప్రాంతానికి సరఫరా చేస్తున్నట్లుగా బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇక వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వారి పట్ల చర్యలకు సిద్దమయ్యారు. అయితే ఇదే విషయాన్ని ఓ ప్రముఖ మీడియా సంస్థ తెలిపింది.