iDreamPost
android-app
ios-app

2.77 కోట్ల విలువైన వెండి స్మగ్లింగ్.. అలా దొరికిపోయారు!

  • Published Sep 22, 2023 | 5:35 PM Updated Updated Sep 22, 2023 | 5:35 PM
2.77 కోట్ల విలువైన వెండి స్మగ్లింగ్.. అలా దొరికిపోయారు!

ఇటీవల కొంతమంది కేటుగాళ్ళు ఈజీ మనీ కోసం ఎన్నో అక్రమా దందాలకు పాల్పపడుతున్నారు. ముఖ్యంగా వీదేశాల నుంచి స్మగ్లింగ్ వ్యాపారంతో కోట్లు గడిస్తున్నారు. బంగారం, వెండి, వజ్రాలతో పాటు అప్పుడప్పుడు మూగజీవాలను కూడా స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు అడ్డంగా బుక్ అవుతుంటారు. హైదరాబాద్ లోని షంషాబాద్ ఎయిర్ పోర్టులో నిత్యం ఇలాంటి కేసులు ఎన్నో వెలుగులోకి వస్తుంటాయి. కోట్ల రూపాయలు విలువ చేసే వెండి వస్తువులను స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు దొరికిపోయారు స్మగ్లర్లు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఉత్తర్ ప్రదేశ్ రాయపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదర్ బజార్ ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి కల్లు చెదిరేలా 355 కిలోగ్రాముల వెండి వస్తువులు లభించాయి. వాటి విలువ రూ. కోట్ల 77 లక్షలు విలువు ఉంటుందని పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వ్యక్తులను రామ్ కుమార్, నహర్ సింగ్, సంజయ్ అగర్వాలు గా గుర్తించారు.

గత కొన్నిరోజులుగా సదర్ బజార్ లో స్మగ్లింగ్ కార్యాకలాపాలు జరుగుతున్నాయని సమాచారం అందుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే సీఐడీ, సైబర్ సెల్‌, కొత్వాలి పోలీసులు సంయుక్త బృందం దాడులు నిర్వహించారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున స్మగ్లింగ్ కి పాల్పపడుతున్న వ్యక్తులను పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న వస్తువులకు సంబంధించిన చట్టపరమైన పత్రాలు లేకపోవడంతో రాయ్ పూర్ పోలీసులు వెండి వస్తువులను స్వాధీనపర్చుకున్నారు. అంతర్-రాష్ట్ర స్మగ్లింగ్ కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలని ఆకస్మిక తనిఖీలను పెంచినట్లు పోలీసులు తెలిపారు.