iDreamPost
android-app
ios-app

దసరా పండుగ వేళ.. పోలీసులపై రివేంజ్ తీర్చుకున్నాడు.. కానీ

దసరా వేళ ఊరంతా సంబరాల్లో మునిగి తేలిపోతుంది. కానీ అంతలో అలజడి. ఆ ప్రాంతమంతా రణరంగంగా మారిపోయింది. కానిస్టేబుల్స్ కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇంతకు ఏం జరిగిందంటే..?

దసరా వేళ ఊరంతా సంబరాల్లో మునిగి తేలిపోతుంది. కానీ అంతలో అలజడి. ఆ ప్రాంతమంతా రణరంగంగా మారిపోయింది. కానిస్టేబుల్స్ కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇంతకు ఏం జరిగిందంటే..?

దసరా పండుగ వేళ.. పోలీసులపై రివేంజ్ తీర్చుకున్నాడు.. కానీ

దసరా ఉత్సవాలు అందరి నివాసాల్లో ఆనందాలు నింపితే.. ఇద్దరు కానిస్టేబుల్స్ జీవితాల్లో చీకట్లు నింపాయి. అమ్మవారి నిమజ్జనం వేళ జరిగిన వివాదం.. ఓ కానిస్టేబుల్‌ను ఆసుపత్రి పాలు చేస్తే.. మరొకరి ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అతడి భార్యా, బిడ్డలు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ రెండు ఘటనలు జరగడానికి మూలాలన్నీ అమ్మవారి నిమజ్జనంతో పాటు గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ముడిపడి ఉన్నాయి. ఇంతకు కానిస్టేబుల్ హాస్పిటల్ పాలవ్వడానికి, ఈ రెండు హత్యలకు లింక్ ఏంటీ..? ఆనందంగా, ఉత్సాహంగా వేడుకలు జరగాల్సిన ఆ ఊరు ఊరంతా రావణ కాష్టలా మారడానికి బాధ్యులు ఎవరు..? బంద్‌కు పిలుపునిచ్చేంతగా ఏం జరిగింది..? పూర్తి వివరాల్లోకి వెళితే..

చత్తీస్ గఢ్‌లోని సూరజ్ పూర్‌లో కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో దసరా ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. దసరా పండుగ నాడు అమ్మవారిని ఊరేగిస్తున్నారు. దీంతో భారీగా పోలీసులు పహారా కాస్తున్నారు. అంతలో కుల్డీప్ సాహు అనే వ్యక్తి.. బిర్యానీ సెంటర్ లోని వేడి నూనెను తీసుకు వచ్చి కానిస్టేబుల్ ఘన్ శ్యామ్ సోన్ వానీపై పోశాడు. విలవిలలాడుతూ అతడు కింద పడిపోగా.. మిగిలిన పోలీసులు అతడ్ని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో నిందితుడు కుల్దీప్‌ను పట్టుకునేందుకు హెడ్ కానిస్టేబుల్ తాలిబ్ షేక్ వెంటపడ్డాడు. అక్కడ నుండి తప్పించుకుని పారిపోయిన నిందితుడు.. కోపంతో తాలిబ్ షేక్ పై రివేంజ్ తీర్చుకోవాలనుకున్నాడు. అదే ఊరిలో ఉంటున్న తాలిబ్ షేక్ ఇంటికి వెళ్లి.. భార్య మొహుఫైజ్, 11 ఏళ్ల కూతురు ఆలియా షేక్‌ను హత్య చేశాడు.

ఈ రెండు మృతదేహాలను ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో పడేశాడు. ఇంట్లో బిడ్డా, భార్య లేకపోవడం.. రక్తపు మరకలు కనిపించడంతో నిందితుడు ఏదో చేసి ఉండటాన్ని ఊరంతా జల్లెడ పట్టారు. చివరకు ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన వీరి మృతదేహాలు కనిపించాయి. ఈ ఘటనతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బాధితులకు అండగా.. పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. నిందితుడి ఇంటి పై దాడి చేసి.. ధ్వంసం చేశారు. నిందితుడి ఇంటి దగ్గర వాహనాలను దగ్దం చేశారు. బంద్‌కు పిలుపునిచ్చి పెద్ద యెత్తున ఆందోళన చేపట్టారు. దీంతో ఊరంతా అట్టుడుకుపోయింది. ఇక పరిస్థితి చేయదాటిపోవడంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితి అదుపులోకి తీసుకు వచ్చారు. అలాగే నగరంలోకర్ఫ్యూ విధించారు. నిందితుడ్ని పట్టుకునేందుకు నాలుగు పోలీసుల బృందాలను నియమించారు.

ప్రాథమిక విచారణలో అతడు పోలీసుల తీరుపై కక్ష పెంచుకుని అదును చూసి ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడైంది. గతంలో కుల్డీప్ సోదరుడు సందీప్.. ఓ వ్యక్తిని టెర్రస్ పై నుండి తోసేశాడు. దీంతో పోలీసులు అతడ్ని పట్టుకున్నారు. అలాగే మరో బంధువు విషయంలో కూడా పోలీసుల చర్యపై కోపాన్ని పెంచుకున్న కుల్దీప్.. దసరా పండుగను పురస్కరించుకుని ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉంది.   పగ, ప్రతీకారం.. అభం, శుభం తెలియని ఇద్దరు ప్రాణాలు తీసింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.