మహిళా అధికారి గలీజ్ దందా.. ఆఫీసులో ఇదేం పని మేడం?

పైన ఫొటోలో చూడటానికి అమాయకంగా కనిపిస్తున్న ఈ మహిళ పేరు మితాలీ శర్మ. ఛత్తీస్ గఢ్ కు చెందిన ఈమె ఈ మధ్యే సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా బాధ్యతలు చేపట్టారు. చూడటానికి బాగా చదువుకున్న వ్యక్తిలా కనిపిస్తుండడంతో అందరూ మేడం బాగానే పని చేసేలా ఉందని భావించారు. కానీ, తీరా చూస్తే.. కొలువులో చేరిన మొదటి రోజే ఈ మహిళా అధికారి గలీజ్ దందాకు తెర లేపింది. ఏకంగా ఆఫీసులోనే అలా చేస్తూ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందంటే?

ఛత్తీస్ గఢ్ కు చెందిన మితాలీ శర్మ ఇటీవల సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా బాధ్యతలు చేపట్టారు. ఇక కొలువులో చేరిన మొదటి రోజు ఆమె ఆఫీసులో ఉన్న అధికారులందరినీ పరిచయం చేసుకున్నారు. చూడటానికి మితాలీ శర్మ బాగా చదువుకున్న వ్యక్తిలా కనిపించడంతో బాగానే పని చేసేలా ఉందని అంతా భావించారు. కానీ, అదే రోజు ఈ మేడం పాడు పనికి తెర లేపింది. అసలు విషయం ఏంటంటే? గర్హై గ్రామానికి చెందిన రామేశ్వర్ ప్రసాద్ యాదవ్ అనే వ్యక్తి ఓ దరఖాస్తు కోసం మితాలీ శర్మను సంప్రదించాడు.

అన్నీ వివరించిన ఆమె చివరలో అతడికి ఊహించని షాకిచ్చింది. నీ పని కావాలంటే ఖచ్చితంగా రూ.20,000 వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో రామేశ్వర్ ప్రసాద్ కు ఏం చేయాలో అర్థం కాక ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే అలెర్ట్ అయిన అధికారులు.. ఆమె కోరినట్లుగానే డబ్బులు ఇవ్వాలని రామేశ్వర్ ప్రసాద్ ను కోరారు. దీంతో అతడు అధికారి మితాలీ శర్మకు డబ్బులు ఇచ్చే సమయానికి ఏసీబీ అధికారులు ఆఫీసులోకి ఎంటరై లంచం తీసుకుంటుండగా మితాలీ శర్మను రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: పాత నోట్లకు.. లక్షల్లో డబ్బులు! లక్షాధికారి అవ్వాలనుకుని చివరికి..!

Show comments