iDreamPost
android-app
ios-app

ఐదేళ్ల ప్రేమ.. ప్రియురాలిని చంపి స్టేటస్ పెట్టిన ప్రియుడు!

  • Published Dec 02, 2023 | 12:14 PM Updated Updated Dec 02, 2023 | 12:14 PM

వీళ్లిద్దరూ ప్రేమికులు. తాజాగా ప్రియుడు తన ప్రియురాలిని చంపి స్టేటస్ పెట్టాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతోంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

వీళ్లిద్దరూ ప్రేమికులు. తాజాగా ప్రియుడు తన ప్రియురాలిని చంపి స్టేటస్ పెట్టాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతోంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

  • Published Dec 02, 2023 | 12:14 PMUpdated Dec 02, 2023 | 12:14 PM
ఐదేళ్ల ప్రేమ.. ప్రియురాలిని చంపి స్టేటస్ పెట్టిన ప్రియుడు!

బౌసియా, ఆషిక్ ఇద్దరు ప్రేమికులు. వీళ్లు చాలా కాలం నుంచి పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ. అలా 5 ఏళ్ల పాటు ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే, ఈ యువతి స్థానికంగా ఉన్న ఓ మెడికల్ కాలేజీలో నర్సింగ్ చదువుతోంది. ఇక సమయం దొరికినప్పుడల్లా ఇద్దరు కలిసి బయట తిరిగేవారు. కట్ చేస్తే.. ప్రియుడు ఆషిక్ ఉన్నట్టుండి కిరాతకానికి పాల్పడ్డాడు. తన ప్రియురాలిని అతి దారుణంగా హత్య చేసి ఆమె శవాన్ని స్టేటస్ పెట్టాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు మీ కోసం.

పోలీసుల కథనం ప్రకారం.. కేరళలోని కొల్లం ప్రాంతానికి చెందిన బౌసియా (20) చెన్నై క్రోంపేటై పరిధిలోని ఓ ప్రాంతంలో ఉన్న ఓ మెడికల్ కాలేజీలో నర్సింగ్ చదువుతోంది. అయితే, ఈమె ఆషిక్ (20) అనే యువకుడితో 5 ఏళ్ల నుంచి ప్రేమలో ఉంది. అతడు కూడా ఆమెను ఎంతో ఇష్టపడ్డాడు. అలా ఈ ప్రేమికులు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఇక సమయం దొరికినప్పుడల్లా ఈ ప్రేమికులు సరదాగా బయటకు వెళ్లేవారు. కుదిరినప్పుడల్లా సినిమాలు, షికారులు అంటూ తెగ ఎంజాయ్ చేసేవారు. ఇకపోతే, తాజాగా ఈ జంట ఓ హోటల్ కు వెళ్లారు. ఓ గది తీసుకుని అక్కడే బస చేశారు. కానీ, ఏదో విషయంపై ఈ ప్రేమికులు గొడవ పడ్డారు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగారు. క్షణికావేశంలో ఊగిపోయిన ఆషిక్ దారుణానికి పాల్పడ్డాడు.

ప్రియురాలి గొంతు పిసికి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె శవాన్ని వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టాడు. ఈ విషయం తెలుసుకుని అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు ఆషిక్ ను అరెస్ట్ చేశారు. అనంతరం బౌసియా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అసలు ప్రియుడు తన ప్రియరాలిని ఎందుకు హత్య చేశాడు? స్టేటస్ పెట్టడానికి కారణం ఏంటనే వివరాలు తెలుసుకునే దిశగా పోలీసులు విచారిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ప్రియురాలిని చంపి ఆ తర్వాత వాట్సాప్ స్టేషస్ పెట్టిన ప్రియుడి కిరాతకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetJojobetHoliganbetJojobetHoliganbetjojobetgrandpashabetkralbetcasibomiptvjojobetcasibomcasibomGrandpashabetgrandpashabetyedibahis girişEscortes BelgiqueCasibomCasibomgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom