iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో మరోసారి హల్ చల్ చేసిన చెడ్డీ గ్యాంగ్

  • Published Aug 11, 2023 | 6:24 PM Updated Updated Aug 11, 2023 | 6:24 PM
  • Published Aug 11, 2023 | 6:24 PMUpdated Aug 11, 2023 | 6:24 PM
హైదరాబాద్ లో మరోసారి హల్ చల్ చేసిన చెడ్డీ గ్యాంగ్

రెండు తెలుగు రాష్ట్రాల్లో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్నాళ్ల నుంచి ఈ గ్యాంగ్ కనిపించకపోవడంతో నగర ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ లో చెడ్డీ గ్యాంగ్ ముఠా కదలికలు మరోసారి కనిపించాయి. గురువారం అర్థరాత్రి మియాపూర్ లోని హఫీజ్ పేట్, వసంత వ్యాలీ విల్లాస్ లో చెడ్డీ గ్యాంగ్ చోరబడింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 10 మందితో కూడిన ఈ ముఠా గ్యాంగ్ కొన్ని ఇళ్లల్లోకి ప్రవేశించారు. ఇదే కాకుండా ఓ ఇంట్లో బీరువాలో దాచి ఉంచిన దాదాపు 30 తులాల బంగారు అభరణాలు చోరీ చేశారు.

ఈ ముఠా సభ్యులు ఇంట్లోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇక ఆ ఇంటి సభ్యులు ఉదయం నిద్రలేచి చూసే సరికి చోరీ జరిగిందని తెలుసుకున్నారు. అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. దొంగలు బయట రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల్లా ఉన్నారని, దర్యాప్తు చేసి తొందర్లోనే వారిని పట్టుకుంటామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. హైదరాబాద్ లో మరోసారి రెచ్చిపోయిన చెడ్డీ గ్యాంగ్ ముఠాపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: తాగుబోతు మొగుడితో తట్టుకోలేకపోయిన అంజలి! ఇలా అయితే కాదని..!

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio