iDreamPost
android-app
ios-app

నెల ముందు నుండే చందన ప్లాన్! కేసులో సంచలన నిజాలు!

  • Published Sep 02, 2023 | 5:49 PM Updated Updated Sep 02, 2023 | 5:49 PM
నెల ముందు నుండే చందన ప్లాన్! కేసులో సంచలన నిజాలు!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టెక్కీ దీప్తి మృతి కేసులో సంచలన విషయం బయటపడింది. జిగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన టెక్కీ దీప్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఎన్నో ఊహించని ట్విస్టులు వెలుగు చూశాయి. తాజాగా టెక్కీ దీప్తి హత్య ఆమె సోదరి చందన చేసిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. బాయ్ ఫ్రెండ్ తో కలిసి దీప్తిని ఆమె చెల్లెలు చందన హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎంతగానో అభిమానించే అక్కను అత్యంత దారుణంగా పక్కా ప్లాన్ తో హతమార్చిన విషయం తెలుసుకొని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఇక పోలీసుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

జిగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన టెక్కీ దీప్తి హత్య కేసులో ఇప్పటి వరకు ఎన్నో ట్విస్టులు వెలుగు లోకి వచ్చాయి. మొత్తానికి ఈ కేసును పోలీసులు ఛేదించారు. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దీప్తి చెల్లెలు చందన ఆమెను హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తెలింది. కోరుట్ల భీమునిదుబ్బలో బంక శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులకు దీప్తి, చందన, సాయి ముగ్గురు సంతానం. దీప్తి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ప్రస్తుతం వర్క్ టూ హూం చేస్తుంది. చందన బీటెక్ చదువుతుంది. సాయి బెంగుళూరులో నివాసం ఉంటున్నాడు. దీప్తి (24) గత నెల 29న ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె చెల్లెలు చందన అదృశ్యం అయ్యింది. దీంతో ఆమెపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. మృతి చెందిన దీప్తి తండ్రి శ్రీనివాస్ రెడ్డి.. చందన సహ మరో వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు.

దీప్తి హత్య కేసులో ఎన్నో ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. చివరికి ఆమె చెల్లెలు చందన తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దీప్తిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. చందన హైదరాబదద్ లో బీటేక్ చదువుతుంది. కాలేజ్ లో తన సీనియర్ ని ప్రేమించింది. ఈ విషయం ఇంట్లో చెప్పడంతో చందన సోదరి దీప్తితో పాటు కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. అప్పటి నుంచి తన ఇంట్లో డబ్బు, నగలు తీసుకొని పారిపోయి తన ప్రియుడిని పెళ్లి చేసుకొని జీవించాలని స్కేచ్ వేసింది చందన. నెల రోజుల ముందు నుంచి తగిన సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు హైదరాబాద్ లో జరుగుతున్న ఓ ఫంక్షన్ కి వెళ్లగా ఒంటరిగా ఉన్న అక్క దీప్తితో మందు పార్టీ చేసుకుంది చందన. అప్పటికే పక్కా ప్లాన్ తో తన బాయ్ ఫ్రెండ్ ని ఇంటికి రప్పించుకుంది. ఈ క్రమంలోనే అక్క దీప్తి మత్తులో ఉండగా ముక్కు, మూతికి ప్లాస్టర్ వేసి చంపేసి.. కోటి రూపాయల విలువ చేసే బంగారం, 2 లక్షల డబ్బు వెళ్లిపోయినట్లు పోలీస్ విచారణలో తెలిపినట్లు సమాచారం. ఈ కేసులో చందన ఆమె ప్రియుడుతో పాటు వారికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis giriş