P Venkatesh
Warangal commiserate: ఓ సీఐ విచక్షణ మరిచి ఓ మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేశాడు. చాక్లెట్స్ ఆశచూపి ఈ ఘోరానికి పాల్పడ్డాడు. అతడిపై పోక్సో కేసు నమోదైంది. అసలు ఏం జరిగిందంటే?
Warangal commiserate: ఓ సీఐ విచక్షణ మరిచి ఓ మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేశాడు. చాక్లెట్స్ ఆశచూపి ఈ ఘోరానికి పాల్పడ్డాడు. అతడిపై పోక్సో కేసు నమోదైంది. అసలు ఏం జరిగిందంటే?
P Venkatesh
రక్షక భటులైన పోలీసులకు సమాజంలో ఎంతో గౌరవం ఉంటుంది. ఆపద సమయంలో దేవుడు ఆదుకుంటాడో లేదో తెలియదు కానీ.. పిలిస్తే వచ్చి వెంటనే కాపాడే వాడు పోలీసు. తప్పు చేసే వారికి భయం కల్పిస్తూ.. నిజాయితీ పరులకు ధైర్యాన్నిస్తారు పోలీసులు. శాంతి భద్రతలను కాపాడుతూ సమాజ క్షేమమే ధ్యేయంగా కృషి చేస్తుంటారు. ఖాకీలు కఠినంగా ఉన్నా కూడా మానవత్వం చూపడంలో ముందుంటారు. అభాగ్యులకు ఆపన్నహస్తం అందిస్తుంటారు. అయితే కొంత మంది దురుసు ప్రవర్తన వల్ల పోలీసులకు చెడ్డ పేరు వస్తుంది. అతి ప్రవర్తన, సామాన్యులపై విరుచుకుపడడం వంటి చర్యల వల్ల పోలీసుల ప్రతిష్టకు భంగం కలుగుతోంది. రక్షక భటులే భక్షక భటులు అవుతున్నారు. కాపాడాల్సిన వారే కాటేస్తున్నారు.
ఇదే తరహాలో ఓ సర్కిల్ ఇన్ స్పెక్టర్ తన బాధ్యతను మరిచాడు. బాధ్యత గల వృత్తిలో ఉండి సభ్య సమాజం తలదించుకునే పని చేశాడు. తండ్రి వయసులో ఉన్న సీఐ ఓ మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. చాక్లెట్స్ ఇస్తానని ఆశ చూపి బాలికను ఇంట్లోకి పిలుచుకుని కాటేయబోయాడు. ఎలాగోలా సీఐ నుంచి తప్పించుకున్న బాలిక తల్లిదండ్రుల చెంతకు చేరి జరిగిన విషయం చెప్పింది. ఈ ఘోరం హనుమకొండలో వెలుగుచూసింది. ఈ ఘటనపై బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినా పోలీసులు, ఉన్నతాధికారులు సదరు సీఐను కాపాడేందుకు విశ్వప్రయత్నం చేశారు. అయితే ఎట్టకేలకు నిందితుడిపై కాజీపేట పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది.
అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సర్కిల్ ఇన్స్‌పెక్టర్ రవికుమార్ హనుమకొండలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికపై కన్నేశాడు. ఈ నెల 9వ తేదీన సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికొచ్చిన సదరు బాలికకు చాక్లెట్ ఇస్తానని ఆశచూపి ఇంట్లోకి పిలిచి, అభ్యంతకరరీతిలో తాకుతూ ప్రవర్తించినట్లు సమాచారం. ఆ బాలిక ఇంటికి వెళ్లాలి అంకుల్ అంటూ విడిపించుకునేందుకు ప్రయత్నించింది. కానీ, సీఐ విచక్షణ మరిచి ఆ బాలికపై అత్యాచార యత్నం చేశాడు. అతడి చెర నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికెళ్లి పేరెంట్స్ తో జరిగిన విషయం చెప్పింది. నిందితుడు పోలీస్ అధికారి కావడంతో కంప్లైంట్ చేసేందుకు భయపడిపోయారు.
కానీ, ఇలాగే వదిలేస్తే ఎప్పటికైనా ముప్పే అని భావించి ఖాజీపేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. దీంతో సీఐ రవికుమార్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి (సీఆర్ నెం.264/2024) కేసు నమోదైనప్పటికి బయటకు పొక్కకుండా స్థానిక పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు చేశారనే ప్రచారం జరుగుతోంది. కానీ, నిజం దాగదు కదా.. ఎఫ్‌ఆర్‌ఐ కాఫీ బయటకు లీక్ కావటంతో సీఐ బాగోతం వెలుగులోకి వచ్చిందని టాక్ వినిపిస్తోంది. రక్షించాల్సిన పోలీసులే ఇలా విచక్షణ మరిచి ప్రవర్తిస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి బాలికపై సీఐ అత్యాచారం చేసిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.