iDreamPost

వీడియో: ఘోర ప్రమాదం.. అతి వేగంతో చెరువులోకి దూసుకెళ్లిన బస్సు

వీడియో: ఘోర ప్రమాదం.. అతి వేగంతో చెరువులోకి దూసుకెళ్లిన బస్సు

ఇటీవల బస్సు ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగం, సాంకేతిక కారణాలతో బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అతివేగంతో పల్టీలు కొట్టి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పుడు తాజాగా మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై అతివేగంతో రయ్ రయ్ మంటూ దూసుకెళ్తూ ఒక్కసారిగా రోడ్డు పక్కనున్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డట్లు తెలుస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. అతి వేగంతో ఉన్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు మూలమలుపు వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఇదంతా బస్సు వెనకాలే వస్తున్న ఓ కారులో ఉన్న డ్యాష్ కెమెరాలో రికార్డయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనే జిల్లాలో ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు 30 మంది ప్రయాణీకులతో బయలుదేరింది. అలా వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో అతి వేగంతో ఉన్న బస్సు రోడ్డు మలుపు వద్ద అదుపుతప్పింది.

క్షణాల్లోనే రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. బస్సు చెరువులో పడిపోగానే వెంటనే అక్కడ ఉన్న స్థానికులు స్పందించారు. బస్సులో ఉన్న ప్రయాణికులను ఒడ్డుకు చేర్చారు. కాగా ఈ ప్రమాదంలో సుమారు పది మంది ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. బస్సు ప్రమాదానికి అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి