iDreamPost
android-app
ios-app

KSRTC: ఫ్రీ టిక్కెట్‌ కావాలా.. అంటూ మహిళపై కండక్టర్ లైంగిక దాడి!

  • Published Mar 13, 2024 | 9:11 AM Updated Updated Mar 13, 2024 | 9:11 AM

ఉచిత బస్సు కదా అని ఎక్కిన పాపానికి ఓ మహిళ దారుణమైన లైంగిక దాడిని ఎదుర్కొవాల్సి వచ్చింది. కండక్టర్‌ నీచ బుద్ధి కారణంగా ఆమెకు ఆ పరిస్థితి ఎదురైంది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉచిత బస్సు కదా అని ఎక్కిన పాపానికి ఓ మహిళ దారుణమైన లైంగిక దాడిని ఎదుర్కొవాల్సి వచ్చింది. కండక్టర్‌ నీచ బుద్ధి కారణంగా ఆమెకు ఆ పరిస్థితి ఎదురైంది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Mar 13, 2024 | 9:11 AMUpdated Mar 13, 2024 | 9:11 AM
KSRTC: ఫ్రీ టిక్కెట్‌ కావాలా.. అంటూ మహిళపై కండక్టర్ లైంగిక దాడి!

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఆధార్‌ కార్డ్‌ చూపిస్తే చాలు ఎక్కడి నుంచి ఎక్కడి కైనా జీరో టిక్కెట్‌పై ఫ్రీగా ప్రయాణించవచ్చు. ఈ పథకం తెలంగాణ కంటే ముందే.. కర్ణాటక రాష్ట్రంలో అమలు అవుతున్న విషయం తెలిసిందే. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. కానీ, ఓ నీచుడు ఈ ఫ్రీ టిక్కెట్‌ ఇవ్వాలంటే తనకు సహకరించాలని ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

బెంగళూరు నుంచి రాయచూర్‌కు వెళ్తున్న ఓ మహిళ రాత్రి పూట ఫ్రీ బస్‌ ఎక్కింది. డ్రైవర్‌ వెనుక సీట్‌లో కూర్చుంది. బస్సులో ఎవరు లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన ఆ బస్సులోని కండక్టర్‌.. తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. ఆ మహిళ బస్సు ఎక్కిన తర్వాత లైట్లు ఆఫ్‌ చేశాడు. మెల్లగా ఆమె పక్కకు చేరి.. ఫ్రీ టిక్కెట్‌ కావాలంటే.. తన కోరిక తీర్చాలని కోరాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. అయినా కూడా బలవంతంగా ఆమె ప్రైవేట్‌ పార్ట్స్‌పై చేతులు వేస్తూ.. అసభ్యంగా ప్రవర్తించి లైంగిక దాడికి దిగాడు.

బస్సు వెళ్తుండగానే ఆ కండక్టర్‌ ఈ దారుణానికి తెగబడ్డాడు. ఈ విషయంపై సదరు మహిళ రాయచూర్‌ ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసింది. వాళ్లు కండక్టర్‌ను నిలదీయడంతో తాను ఏ తప్పు చేయలేదని బుకాయించాడు. ఈ ఘటన తెలిసి.. ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. మహిళలకు రక్షణ లేకుండా.. ఫ్రీ బస్సులు పెట్టి ఏం లాభం అంటూ మండిపడుతున్నారు. అయితే.. కండక్టర్‌పై విచారణ జరిగిపి, ఈ విషయమై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.