iDreamPost
android-app
ios-app

ACBకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్.. అవమానంతో బలవన్మరణం!

  • Published Nov 26, 2023 | 1:25 PM Updated Updated Nov 26, 2023 | 1:25 PM

దేశంలో ఎక్కడైనా పనులు జరగాలంటే ఎంతో కొంత లంచం ముట్టజెప్పనిదే పనులు జరగవు అన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ తంతు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

దేశంలో ఎక్కడైనా పనులు జరగాలంటే ఎంతో కొంత లంచం ముట్టజెప్పనిదే పనులు జరగవు అన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ తంతు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

ACBకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్.. అవమానంతో బలవన్మరణం!

ఈ మద్య లంచం లేనిదే ఎక్కడ చిన్న పనికూడా జరగదని తెలిసిందే. అన్ని ప్రైవేట్, ప్రభుత్వ వ్యవస్థలో జరిగే తంతే. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా పని కావాలంటే తప్పనిసరిగా డబ్బు ఇవ్వాల్సిందే. లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినప్పటికీ కొంతమంది ప్రభుత్వాధికారులు తీరు మారడం లేదు. అటెండర్ నుంచి ఉన్నత హోదాలో ఉన్నవారికి ఏదో ఒక రూపంలో సమర్పించుకోవాల్సిన పరిస్థితి. ఓ ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.. తర్వాత దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం లో జరిగింది.

శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్ శ్రీనివాస్ నాయక్ నాలుగు రోజుల క్రితం ఓ రైతు వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండడ్ గా దొరికి పోయాడు. ఈ క్రమంలోనే అధికారుల కళ్లుగప్పి చెన్నై పారిపోయి అక్కడ ఓ లాడ్జిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రహ్మణపల్లికి చెందిన లింగాల సురేంద్రారెడ్డి తన ఆస్తిని మార్చిలో రిజిస్ట్రర్ చేయించుకున్నాడు. అందుకు గాను అప్పట్లో 30 వేల లంచం ఇచ్చారు. అంతా ఓకే అనుకున్న సమయంలో స్టాంప్ డ్యూటీ తక్కువతో రిజిస్ట్రేషన్ చేశానని.. అందుకు లక్ష రూపాయలు ఖర్చయ్యిందని మరో లక్ష డాక్యుమెంట్ రైటర్ శ్రీహరి ఆ రైతుపై ఒత్తిడి తెచ్చాడు.

మొత్తానికి 50 వేలకు ఒప్పందం కుదుర్చుకొని ఈ నెల 16న బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 22న సాయంత్రం ఆ రైతు రూ.10 వేల తీసుకొని సబ్ రిజిస్ట్రార్ వద్దకు వెళ్లగా.. డబ్బు డాక్యుమెంట్ రైటర్ కి ఇవ్వాలని శ్రీనివాస్ నాయకు సూచించారు. అదే సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి సబ్ రిజిస్ట్రర్ శ్రీనివాస్ తో పాటు రైటర్ శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే అవమాన భారంతో రాత్రి గోడ దూకి చెన్నైలోని మాధవాపురంలో ఓ లాడ్జిలో దిగిన శ్రీనావాస్ నాయక్ అక్కడే ఉరివేసుకొని చనిపోయాడు. లాడ్జి నిర్వాహకులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.