P Venkatesh
అబ్బాయిలు బీ కేర్ ఫుల్. మార్కెట్ లోకి కొత్త రకం స్కామ్ వచ్చింది. కక్కుర్తి పడి అలా చేశారో మీరు బుక్ అయినట్లే. ఇంతకీ ఆ కొత్త రకం స్కామ్ ఏంటంటే?
అబ్బాయిలు బీ కేర్ ఫుల్. మార్కెట్ లోకి కొత్త రకం స్కామ్ వచ్చింది. కక్కుర్తి పడి అలా చేశారో మీరు బుక్ అయినట్లే. ఇంతకీ ఆ కొత్త రకం స్కామ్ ఏంటంటే?
P Venkatesh
టెక్నాలజీలో వచ్చిన డెవలప్ మెంట్ తో ఉపయోగాలతో పాటు నష్టాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. సాంకేతికత దుర్వినియోగంతో మోసాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. సైబర్ ఫ్రాడ్ తో జనాలను బురిడీ కొట్టిస్తూ లక్షలు కొల్లగొడుతున్నారు సైబర్ క్రిమినల్స్. తక్కువ సయంలోనే ఎక్కువ ఆదాయం పొందొచ్చంటూ లింక్స్ పెడుతూ మోసాలకు పాల్పడుతున్నారు. యూట్యూబ్ లో లైకుల పేరిట స్కామ్ లకు తెరలేపుతున్నారు. కాల్స్, మెసేజ్ లతో కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ క్రిమినల్స్. తాజాగా మరో కొత్త రకం స్కామ్ వెలుగు చూసింది. అబ్బాయిలే టార్గెట్ గా చేసుకుని సైబర్ నేరస్తులు రెచ్చిపోతున్నారు.
ఇటీవల సైబర్ నేరగాళ్లు రోజుకో ఎత్తుగడలతో ఫ్రాడ్ చేస్తున్నారు. ఈ కేవైసీ అప్ డేట్ చేసుకోండంటూ, ఆధార్ పాన్ తో లింక్ చేయండి అంటూ లింక్స్ పంపిస్తూ దోచుకుంటున్నారు. అమాయకులే టార్గెట్ గా చేసుకుని లక్షల రూపాయలను దండుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికలైన వాట్సాప్, ఇన్స్టా, ఫేస్ బుక్ లలో ఫేక్ లింక్స్ పంపిస్తూ.. సదరు వ్యక్తులు వాటిని క్లిక్ చేయగానే అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. అయితే తాజాగా అబ్బాయిలే టార్గెట్ గా కొత్త రకం స్కామ్ వెలుగులోకి వచ్చింది. అమ్మాయిల పేరుతో మెసేజ్ లు పంపిస్తూ మోసాలకు తెగబడుతున్నారు. అబ్బాయిల వీక్ పాయింట్ ను బేస్ చేసుకుని స్కామ్ లకు తెరలేపుతున్నారు.
అబ్బాయిలుకు ట్విట్టర్, ఇన్స్టాలో మెసేజ్ లు పంపిస్తూ.. మాచెల్లి మీ ప్రొఫైల్ చూసింది. మీరు మా చెల్లికి బాగా నచ్చారు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. తను మీకు చెప్పేందుకు సిగ్గుపడుతుంది అంటూ మెసేజ్ లు పింపిస్తున్నారు. ఆ మెసేజ్ లోని లింక్ పై క్లిక్ చేసి మీ ప్రొఫైల్ ను అప్ డేట్ చేస్తే మా చెల్లి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతది అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఇక ఇలా మెసేజ్ వచ్చాక సాధారణంగా ఏ అబ్బాయి అయినా టెంప్ట్ అవ్వకుండా ఉండలేరు కదా. హీరో లెవెల్ లో బిల్డప్ ఇస్తూ నేను అందగాన్ని, అమ్మాయిల కలల రాకుమారుడిని అందుకే ఆ అమ్మాయికి నేను నచ్చాను అంటూ ఆ లింక్ లను క్లిక్ చేశారో మొదటికే మోసం వస్తుంది. కక్కుర్తి పడి ఆ లింక్ క్లిక్ చేయగానే అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. అబ్బాయిలు జాగ్రత్త.. ఇలాంటి వాటికి స్పందించారో ఇక అంతే సంగతులు.