iDreamPost
android-app
ios-app

ప్రియురాలి ఇంట్లో ప్రియుడు.. ఆమె తండ్రి రావటంతో..

ప్రియురాలి ఇంట్లో ప్రియుడు.. ఆమె తండ్రి రావటంతో..

ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణం తీసింది. ప్రియురాలి ఇంటికి వెళ్లిన అతడు 4వ అంతస్తు నుంచి దూకటంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ప్రియురాలి ఇంట్లో ఉండగా.. ఆమె తండ్రి రావటంతో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని బోరబండలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌లోని బోరబండకు చెందిన 19 ఏళ్ల మహమ్మద్‌ షోయబ్‌ అనే యువకుడు తనుండే ప్రాంతంలోని ఓ బేకరీలో పని చేస్తున్నాడు.

అతడికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో కొద్ది నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి అతడు తన ప్రియురాలి ఇంటికి పిజ్జా తీసుకుని వెళ్లాడు. షోయబ్‌ ఇంట్లో ఉన్న సమయంలో యువతి తండ్రి వచ్చాడు. డోర్‌ కొట్టింది తన ప్రియురాలి తండ్రి అని తెలియగానే షోయబ్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. తాను ఇంట్లో ఉన్న సంగతి అతడికి తెలిస్తే పెద్ద గొడవ జరుగుతుందని అతడు భావించాడు. ఆ భయంలో విచక్షణ కోల్పోయాడు.

నాలుగో అంతస్తు పైనుంచి కిందకు దూకాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తం మడుగులో పడిఉన్న అతడ్ని స్థానికులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సైతం ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అందించారు. షోయబ్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియాకు తీసుకెళ్లారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు సోమవారం ఉదయం కన్నుమూశాడు. షోయబ్‌ మరణంపై అతడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabet