iDreamPost
android-app
ios-app

Hyderabad: BJP నేత దారుణ హత్య.. ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి మరీ

  • Published Feb 08, 2024 | 11:09 AM Updated Updated Feb 08, 2024 | 11:09 AM

హైదరాబాద్‌ నగరంలో దారుణం చోటు చేసుకుంది. అత్యంత పాశవికంగా ఓ వ్యక్తిని హత్య చేశారు. ఆ వివరాలు..

హైదరాబాద్‌ నగరంలో దారుణం చోటు చేసుకుంది. అత్యంత పాశవికంగా ఓ వ్యక్తిని హత్య చేశారు. ఆ వివరాలు..

  • Published Feb 08, 2024 | 11:09 AMUpdated Feb 08, 2024 | 11:09 AM
Hyderabad: BJP నేత దారుణ హత్య.. ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి మరీ

మంచి, మానవత్వం వంటి లక్షణాలు అడుగంటిపోతున్నాయి. మనుషుల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. చిన్న చిన్న కారణాలకే దారుణాలకు పాల్పడే వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతోంది. అత్యంత కిరాతకంగా, పాశవికంగా హత్యలు చేస్తున్నారు. కొన్ని నేరాలు జరిగిన తీరు చూస్తే.. మనుషులు ఇంత రాక్షసంగా కూడా ఉంటారా అనిపించక మానదు. తాజాగా హైదరాబాద్‌లో ఓ చోట ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. బీజేపీ నాయకుడు ఒకరిని అత్యంత కిరాతకంగా హతమార్చారు దుండగులు. అతడి ప్రైవేట్‌ పార్ట్స్‌ కట్‌ చేసి.. గొంతు కోసం అత్యంత భయానకంగా హత్య చేశారు. ఆ వివరాలు..

హైదరాబాద్‌ యూసఫ్‌గూడ్‌ ఎల్‌ఎన్‌ నగర్‌లో బీజేపీ నేత ఒకరు దారుణహత్యకు గురయ్యాడు. పది మంది గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా దాడి చేసి హత్య చేశారు. వివాహేతర సంబంధమే ఈ దారుణానికి కారణంగా తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్‌ కర్నూలు జిల్లాకు చెందిన సింగోటం రాము బీజేపీ పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. దాంతో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవాడు. ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. అతడికి భార్య, కుమార్తె ఉన్నారు.

Brutal murder of BJP leader

రాము భార్య, కుమార్తె స్వగ్రామంలో ఉంటుండగా.. అతడు మాత్రం యూసుఫ్‌గూడ ఎల్‌ఎన్‌ నగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. అయితే బుధవారం రాత్రి 11 గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని దుండగులు అతడు అద్దెకు ఉంటున్న నివాసం దగ్గరకు వచ్చి.. రాముపై దాడి చేశారు. అతడి ప్రైవేట్‌ పార్ట్స్‌ కట్‌ చేయడంతో పాటు గొంతు కోసి అత్యంత పాశవీకంగా హత్య చేశారు. దారుణం గమనించిన స్థానికులు దీని గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.

అనంతరం రాము మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగింది అంటున్నారు స్థానికులు. స్థానికంగా ఉండే ఓ మహిళతో రాముకు వివాహేతర సంబంధం ఉందని.. అందువల్లే ఈ దారుణం చోటు చేసుకుందని అంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా దారుణ హత్యకు గురైన రాము.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి నాగర్‌ కర్నూల్‌ ఎంపీ టికెట్‌ ఆశిస్తున్నట్లు తెలిసింది.

marsbahis giriş