iDreamPost
android-app
ios-app

వామ్మో ఇదేం దారుణం సామీ.. పెళ్లైన 4 నెలలకే..!

  • Published Jul 19, 2023 | 9:53 PM Updated Updated Jul 19, 2023 | 9:53 PM
  • Published Jul 19, 2023 | 9:53 PMUpdated Jul 19, 2023 | 9:53 PM
వామ్మో ఇదేం దారుణం సామీ.. పెళ్లైన 4 నెలలకే..!

రోజు రోజుకు సమాజంలోని మనుషులు కాస్త మృగాలుగా మారి పోతున్నారు. ప్రతీ చిన్న సమస్యకు కూడా పరిష్కారం వెతకకుండా ఆత్మహత్య చేసుకోవడమో లేదంటే హత్యలకు కత్తులు నూరడమో చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజు రోజుకు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా బిహార్ లో చోటు చేసుకుంది. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకి ఈ యువతి ఎవరు? ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. బీహార్ లోని గోపాల్ గంజ్ లో ముకేశ్ కుమార్-నిశాకుమారి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి నాలుగు నెలల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొన్నిరోజుల పాటు ఈ భార్యాభర్తలు ఎలాంటి గొడవలు, మనస్పర్థలు లేకుండా సంతోషంగా గడిపారు. కానీ, భర్త ముకేష్ కుమార్ పెళ్లైన కొన్ని రోజులకే తనలో దాగి ఉన్న అసలు రూపాన్ని బయటకు తీశాడు. పుట్టింటి నుంచి అదనపు కట్నం తేవాలంటూ నవ వధువు నిశా కుమారిని వేధించడం మొదలు పెట్టాడు. మొదట్లో ఇవన్నీ మాములే అంటూ ఆ యువతి చూసి చూడనట్లుగా వదిలేసింది. కానీ, రాను రాను భర్త టార్చర్ మరింత ఎక్కువైంది.

దీంతో ఇటీవల ముకేష్ కుమార్ ఇదే అంశంపై భార్యతో గొడవ పడ్డాడు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. క్షణికావేశంలో ఊగిపోయిన ముకేష్ కుమార్.. భార్య నిశా కుమారిని అతి దారుణంగా కొట్టాడు. ఇతని దాడిలో ఆ నవ వధువు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక నిశా కుమారి కుటుంబ సభ్యులు అక్కడి చేరుకుని భర్త ముకేష్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు.

ఆమె మృతదేహాన్ని వారి ఇంటి ముందే దహనం చేయాలని కూడా చూశారు. కానీ, పోలీసులు కలగజేసుకుని అడ్డుకున్నారు. అనంతరం మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అదనపు కట్నం కోసం నవ వధువుని దారుణంగా హత్య చేసిన భర్త కిరాతకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: పెళ్లై ఏడాది కూడా కాలేదు.. కానీ, అంతలోనే!

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss