iDreamPost
android-app
ios-app

తాళికట్టిన మొగుడిపై పగ తీర్చుకున్న భార్యలు! ఆ రోజు రాత్రి..!

తాళికట్టిన మొగుడిపై పగ తీర్చుకున్న భార్యలు! ఆ రోజు రాత్రి..!

పైన ఫొటోలో కనిపిస్తున్న ఇతని పేరు ఆలంగీర్. వయసు 45 ఏళ్లు. పరిస్థితుల నేపథ్యంలోనే గతంలో ఇద్దరు మహిళలను వివాహం చేసుకున్నాడు. ముగ్గురు కలిసి కొన్నాళ్ల పాటు ఢిల్లీలోని ఓ ప్రాంతంలో కాపురం పెట్టారు. కానీ, ఉన్నట్టుండి వీళ్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఇద్దరు భార్యలు భర్తపై కోపం పెంచుకున్నారు. ఎలాగైనా భర్తపై పగ తీర్చుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఇక ఇందులో భాగంగానే ఇటీవల ఓ రోజు రాత్రి ఇద్దరు భార్యలు కలిసి దారుణానికి పాల్పడ్డారు. అసలేం జరిగిందంటే?

బీహార్ లోని ఛప్రాకు చెందిన ఆలంగీర్ (45) అనే వ్యక్తి 10 ఏళ్ల కిందట సల్మా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. ఇక ఇద్దరి మధ్య గొడవలు రాజుకున్నాయి. దీంతో కొన్నాళ్లకి ఆలంగీర్ అమీనా అనే మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లు కూడా కొన్ని రోజుల పాటు సంతోషంగానే కాపురాన్ని కొనసాగించారు. ఇక కొన్నిరోజుల తర్వాత ఆలంగీర్ తన రెండవ భార్యతో కూడా గొడవ పడ్డట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. భర్తతో పాటు ఇద్దరు భార్యలు కొంత కాలం పాటు ఢిల్లీలోని ఓ ప్రాంతంలో కాపురం పెట్టారు. భర్త అదే ప్రాంతంలో ఓ చోట పని చేస్తుండేవాడు. అక్కడ కూడా ఆలంగీర్, సల్మా, అమీనాతో మరోసారి గొడవ పడ్డారు. దీంతో ఇద్దరు భార్యలు తిరిగి బీహార్ కు వచ్చారు.

ఇకపోతే, ఆలంగీర్ ఇటీవల బక్రీద్ పండగ నేపథ్యంలో బీహార్ కు వచ్చాడు. ఈ విషయం అతని ఇద్దరి భార్యలకు తెలిసింది. వీళ్లిద్దరూ ఎప్పటి నుంచో భర్తపై కోపం పెంచుకున్నారు. సమయం దొరికితే చంపాలని పథకం రచించినట్లు సమాచారం. ఇక ఆ రోజు కూడా రానే వచ్చింది. ఇద్దరు భార్యలు కలిసి ఇటీవల భర్త ఇంటికి వచ్చారు. ఓ రోజు రాత్రి సల్మా, అమీనా ఇద్దరూ భర్తతో మరోసారి వాగ్వాదానికి దిగారు. ఇక పట్టరాని కోపంతో ఊగిపోయిన ఆ ఇద్దరు భార్యలు.. భర్తను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసి పగ తీర్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆలంగీర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులైన ఇద్దరు భార్యలను అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetmoon girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis