iDreamPost
android-app
ios-app

రియల్టర్ కమ్మరి కృష్ణ కేసు.. కన్న కొడుకే హంతకుడు!

Big Twist In Shadnagar Realtor Kammari Krishna Case: షాద్ నగర్ రియల్టర్ కమ్మరి కృష్ణ హత్య కేసుకు సంబంధించి పోలీసులు విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. హత్య చేయించింది కమ్మరి కృష్ణ కొడుకే అని పోలీలులు నిర్ధారించారు. సుపారీ ఇచ్చి మరీ ఈ హత్య చేయించాడు.

Big Twist In Shadnagar Realtor Kammari Krishna Case: షాద్ నగర్ రియల్టర్ కమ్మరి కృష్ణ హత్య కేసుకు సంబంధించి పోలీసులు విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. హత్య చేయించింది కమ్మరి కృష్ణ కొడుకే అని పోలీలులు నిర్ధారించారు. సుపారీ ఇచ్చి మరీ ఈ హత్య చేయించాడు.

రియల్టర్ కమ్మరి కృష్ణ కేసు.. కన్న కొడుకే హంతకుడు!

తల్లి జన్మని ఇచ్చినా కూడా తండ్రే ఈ లోకాన్ని పరిచయం చేస్తాడు. తన గుండెల మీద పెట్టుకుని ఆడిస్తాడు. భుజాల మీద ఎక్కించుకుని ఈ ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తాడు. అలాంటి తండ్రిని ఈ తనయుడు తిరిగిరాని లోకాలకు పంపేశాడు. పుత్రుడు పుడితే పున్నామ నరకం నుంచి తప్పించుకోవచ్చు అంటారు. కానీ, ఇలాంటి పుత్రుడు ఉంటే పరలోకానికి పంపేస్తాడు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో సంచలనంగా మారిన రియల్టర్ కమ్మరి కృష్ణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసులో కుమారుడే ప్రధాన నిందితుడిగా తేల్చిన పోలీసులు అరెస్టు చేశారు. తండ్రి ఆస్తి మొత్తాన్ని మూడో భార్యకు రాసిస్తాడేమో అనే భయంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్లు చెప్పాడు. ఏకంగా రూ.25 లక్షల సుపారీ ఇచ్చి మరీ ఈ హత్య చేయించాడు.

రియల్టర్ కృష్ణకు మొదట వివాహం జరిగింది. అయితే మొదటి భార్య, ఆమె పిల్లలను పట్టించుకోకుండా.. రెడో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ రెండో భార్య చనిపోయింది. అప్పుడు కూడా మొదటి భార్యను పట్టించుకోకుండా.. మూడో పెళ్లి చేసుకున్నాడు. మూడో భార్యకు 16 నెలల పాప ఉంది. మూడో భార్య పేరిట 16 కోట్ల విలువజేసే ఆస్తిని రాసిచ్చాడు. ఈ విషయంలోనే కుమారుడు ఆందోళన చెందినట్లు తెలుస్తోంది. ఇలాగే వదిలేస్తే.. తన తండ్రి ఉన్న ఆస్తి మొత్తం మూడో భార్యకు రాసిచ్చేస్తాడు అని అతను భావించాడట. అందుకే సుపారి ఇచ్చి ఈ హత్య చేయించాడు. పక్కా ప్రణాళికతో ఈ హత్య చేయించాడు.

తన వద్ద పనిచేసే బాబా శివానంద్ తో ఈ పని చేయించాడు. అతనికి రూ.25 లక్షల నగదు.. ఒక ఇల్లు ఇస్తాను నమ్మబలికాడు. అడ్వాన్సుగా రూ.2 లక్షలు కూడా ఇచ్చాడు. బాబా మరో ఇద్దరితో కలిసి ఈ హత్య చేశాడు. జీలకర్ర గణేశ్ అలియాస్ లడ్డు, మైనర్ బాలుడితో కలిసి కేకే ఫామ్ హౌస్ కు వెళ్లారు. అక్కడ కమ్మరి కృష్ణ గొంతు కోసి.. పొట్టలో పొడిచి హత్య చేశారు. జీలకర్ర గణేశ్- మైనర్ బాలుడు కమ్మరి కృష్ణ చేతులను వెనక్కి లాగి పట్టుకోగా.. బాబా అతని గొంతు కోసి.. పొట్టలో పొడిచాడు. ఆ తర్వాత వాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. అయితే అతని అరుపులు విన్న భార్య.. కృష్ణను శంషాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించింది. అప్పటికే కమ్మరి కృష్ణ మృతి చెందినట్లు వైద్యలు తెలిపారు. నిందితుల నుంచి పోలీసులు రెండు కార్లు, ఒక బైక్, 3 కత్తులు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మృతుడు రియల్టర్ కమ్మరి కృష్ణకు రూ.100 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయి. మొదటి భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి