iDreamPost
android-app
ios-app

వీడిన సింధు హత్య మిస్టరీ! ఆమెను చంపింది ఎవరో కాదు..!

  • Published Jul 26, 2023 | 5:26 PM Updated Updated Jul 26, 2023 | 5:26 PM
  • Published Jul 26, 2023 | 5:26 PMUpdated Jul 26, 2023 | 5:26 PM
వీడిన సింధు హత్య మిస్టరీ! ఆమెను చంపింది ఎవరో కాదు..!

కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సింధు అనే యువతి మరణం మిస్టరీగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనను పోలీసులు అనేక కోణాల్లో విచారించగా ఎట్టకేలకు ఈ హత్య కేసు మిస్టరీ వీడింది. పోలీసులు తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆమె సొంత కుటుంబ సభ్యులే హత్య చేశారని తేలింది. గత కొన్ని రోజుల నుంచి మిస్టరీగా ఉన్న ఈ హత్య కేసులో అసలు నిజాలు బయటపడడంతో స్థానికులు, మృతురాలి బంధువులు అంతా షాక్ గురవుతున్నారు. ఇంతకు ఆ యువతిని హత్య చేసింది ఎవరనే కదా మీ ప్రశ్న. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఇల్లందులో ఇటీవల ఇంట్లో సింధు (20) అనే యువతి అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముందుగా మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అయితే, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మాత్రం తీవ్రంగా దాడి చేయడంతోనే సింధు మరణించిందని వెల్లడైంది.

దీంతో పోలీసులు ఆమె కుటుంబ సభ్యులను విచారించగా ఒక్కొక్కటిగా అసలు నిజాలు బయటపడ్డాయి. సింధు ఓ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తూనే యూట్యూబ్ లో వీడియోలు చేసేది . ఇదంతా ఆమె సోదరుడైన హిరిలాల్ కు నచ్చలేదు. ఇదే విషయంపై గత కొన్ని రోజుల నుంచి అన్నా, చెల్లెలు గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే ఇటీవల మరోసారి గొడవ పడ్డారు. ఇక క్షణికావేశంలో హరిలాల్.. ఇంట్లో ఉన్న రోకలి బండతో చెల్లి సింధుపై దాడి చేశాడు. దీంతో సింధు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇది కూడా చదవండి: కామాంధుడి వేధింపులను తట్టుకోలేక ఇంటి ఓనర్ ఆత్మహత్య!

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio