P Krishna
Bhadradri Kothagudem Crime News:పెళ్లయి రెండేళ్లు అవుతున్నా.. పిల్లలు పుట్టలేదన్న కారణంతో వివాహితను అత్తింటి వారు చిత్ర హింసలకు గురి చేశారు. తన బాధ అర్థం చేసుకుంటాడనుకున్న భర్త సైతం తల్లిదండ్రుల మాట వింటూ మానసికంగా హింసించడం మొదలు పెట్టాడు.. చివరికి భార్య ఏం చేసిందంటే..
Bhadradri Kothagudem Crime News:పెళ్లయి రెండేళ్లు అవుతున్నా.. పిల్లలు పుట్టలేదన్న కారణంతో వివాహితను అత్తింటి వారు చిత్ర హింసలకు గురి చేశారు. తన బాధ అర్థం చేసుకుంటాడనుకున్న భర్త సైతం తల్లిదండ్రుల మాట వింటూ మానసికంగా హింసించడం మొదలు పెట్టాడు.. చివరికి భార్య ఏం చేసిందంటే..
P Krishna
పెళ్లి చేసుకొని ఎన్నో ఆశలతో అత్తారింటిలోకి అడుగు పెట్టింది. పెళ్లై రెండేళ్లు అవుతున్నా పిల్లలు పుట్టడం లేదు.. సొసైటీలో తలెత్తుకోలేకపోతున్నాం అంటూ అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. ఇక భర్త మరో అడుగు ముందుకు వేసి నీకు ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదు, నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటా వద్దంటే మరో యువతిని పెళ్లి చేసుకుంటా అంటూ బెదిరిస్తూ వచ్చాడు. పిల్లలకు జన్మనివ్వని నీ బతుకు ఎందుకు చచ్చిపో అంటూ వేధించాడు. భర్త, అత్తింటి వారి వేధింపులు భరించలేక వివాహిత ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆ వివాహిత ఏం చేసింది? అనే విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మూకమామిడి గ్రామానికి చెందిన భుక్యా రేణుకకు.. టేకులపల్లి మండలం దంతాల తండాకు చెందిన భుక్యా బాబులాల్ కు 2022 లో పెళ్లైంది. పెళ్లయిన రెండు సంవత్సరాలయినా సంతానం కలుగకపోవడంతో అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. నువు గొడ్రాలివి.. నీకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు అంటూ మానసికంగా హింసించడం మొదలు పెట్టారు. నువు విడాకులు ఇస్తే మా కొడుకు బాబులాల్ కి మరో పెళ్లి చేస్తాం అంటూ అత్తా, మామ ఒత్తిడి తీసుకురావడం మొదలు పెట్టారు. తల్లిదండ్రుల మాట విన్న భర్త బాబు లాల్ సైతం రేణుకను మానసికంగా, శారీరకంగా హింసించడం మొదలు పెట్టాడు.
అంతేకాదు నువు విడాకులు ఇస్తే సరి.. లేదంటే నీ చెల్లి కళ్యాణిని ఇచ్చి వివాహం చేయాలని షరతులు పెట్టాడు. అలా కాకుంటే వేరే యువతిని పెళ్లి చేసుకుంటా అంటూ ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చాడు. ఇక భర్త, అత్తమామల వేధింపులు భరించలేక రేణుక పుట్టింటికి వచ్చి అక్కడే ఉంటుంది. అత్తింటి వేధింపులు.. ఇరుగు పొరుగు మాటలతో మానసిక క్షోభకు గురైంది రేణుక. ఈ లోకంలో ఉండకూడదు అనే నిర్ణయానికి వచ్చింది. సెప్టెంబర్ 27న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పొలాల్లో చల్లే మందును తాగింది ఆత్మహత్యకు పాల్పపడింది. అది గమనించి కుటుంబ సభ్యులు పాల్వంచ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రేణుక గురువారం కన్నుమూసింది. చావు బతుకుల మద్య వారం రోజులు ఆస్పత్రిలో ఉన్న భార్యను కనీసం చూడటానికి భర్త, అత్తమామలు రాలేదు. తమ కూతురు చావుకు భర్త, అత్తమామలే కారణం అంటూ రేణుకు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు రేణుక చనిపోతూ.. తన చావుకు కారణం భర్త బాబూలాల్, అతని కుటుంబ సభ్యులు అని మరణ వాంగూల్మం ఇచ్చింది. రేణుక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.