Dharani
Dharani
సోషల్ మీడియా వినియోగం వల్ల ఎన్ని లాభాలున్నాయో.. నష్టాలు కూడా అదే విధంగా ఉన్నాయి. లాభనష్టాలు అంటే మనం వినియోగించుకునేదాని బట్టి ఉంటుంది.ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా మొదలైన లవ్ స్టోరీలు, ప్రేమ కథా చిత్రాలు, క్రైమ్ కథా చిత్రాలు అనేకం వెలుగులోకి వస్తోన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా సోషల్ మీడియా వినియోగం.. ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. సొంత చెల్లిని అత్యంత దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. రోకలిబండతో చెల్లిపై దాడి చేసి అత్యంత పాశవీకంగా హత్య చేశాడు. మరి సదరు యువకుడు ఎందుకు ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు.. సొంత చెల్లిని ఎందుకు హత్య చేశాడు అంటే..
ఈ దారుణ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం, ఇల్లెందు మండలం, రాజీవ్‌నగర్‌లో నాలుగు రోజుల క్రితం చోటు చేసుకుంది. మృతురాలు అజ్మీరా సింధు.. ఏఎన్‌ఎం అప్రెంటిస్‌గా మహబూబాబాద్‌లో పని చేస్తోంది. తల్లి, సోదరుడు హరిలాల్‌తో కలిసి ఉండేది. అయితే సింధు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఖాళీ సమయంలో రీల్స్ చూడటమే కాక ఆమె కూడా స్వయంగా రీల్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసేది. అయితే సింధు తీరు ఆమె సోదరుడు హరిలాల్‌కు నచ్చేది కాదు. దీని గురించి ఇద్దరి మధ్య తరచుగా వాగ్వాదం చోటు చేసుకునేది.
తాజాగా సింధు ఓ యువకుడితో కలిసి రీల్స్ చేసింది. దీని గురించి సోదరుడు హరిలాల్ ఆమెను హెచ్చరించాడు. కానీ సింధు అతడి మాటలు వినకుండా రీల్ చేయడమే కాక.. దాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో పోస్ట్ చేసింది. ఇది చూసి హరిలాల్ తీవ్ర ఆవేశానికి గురయ్యాడు. సింధు తన మాట వినదని అర్థం చేసుకున్నాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం రోకలిబండ తీసుకుని.. సింధు తలపై మోదాడు. ఈ ఘటనలో బాధితురాలి తలకు తీవ్ర గాయం కావడంతో.. ఆమె మృతి చెందింది. సింధు మృతికి కారణమైన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హత్యకు దారి తీసిన రీల్ వీడియో ఇదే#News18Telugu pic.twitter.com/iAG2hWyJSe
— News18 Telugu (@News18Telugu) July 27, 2023