Venkateswarlu
Venkateswarlu
ప్రేమ, పెళ్లిల పేరుతో మోసాలు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి. ముఖ్యంగా కొంతమంది యువతులు హనీట్రాప్‌లతో పెళ్లికాని యువకులను మోసం చేస్తున్నారు. నిత్యం ఎక్కడో ఓ చోట ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఓ యువతి పెళ్లి పేరుతో పదుల సంఖ్యలో తెలుగు యువకులను మోసం చేసింది. వారినుంచి పెద్ద మొత్తంలో డబ్బు కాజేసింది. చివరకు పాపం పండి జైలు పాలైంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెకు చెందిన శ్రావణ సంధ్య అనే యువతి బెంగళూరులోని మదివాలలో ఉంటోంది.
శ్రావణ సంధ్య మాట్రిమోనియల్ సైట్స్ ద్వారా తెలుగు యువకులను టార్గెట్ చేసింది. వారిని పెళ్లి పేరుతో ముగ్గులోకి దింపి మోసం చేయసాగింది. వారినుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కాజేయసాగింది. ఈ నేపథ్యంలోనే చెన్నైలోని ఓ కాల్ సెంటర్‌లో పని చేస్తున్న అశోక్ చైతన్య అనే యువకుడితో శ్రావణ సంధ్య పరిచయం పెంచుకుంది. అతడితో చాలా క్లోజ్‌గా మాట్లాడసాగింది. ఆమె నటనను అశోక్ ప్రేమ అనుకున్నాడు. శ్రావణ సంధ్యను ఎంతో అభిమానించసాగాడు. దీంతో అశోక్‌కు పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమె అతడి వద్దనుంచి అవసరం ఉన్నప్పుడల్లా డబ్బులు తీసుకోసాగింది.
అలా దాదాపు 9 లక్షల రూపాయలు అతడినుంచి కాజేసింది. అసలు విషయం తెలియని అశోక్ పెళ్లికి ఏర్పాట్లు చేయటం మొదలుపెట్టాడు. ఇక, అప్పటినుంచి ఆమె అతడ్ని దూరం పెడుతూ రాసాగింది. చివరికి అతడితో ఉన్న అన్ని కాంటాక్ట్స్‌ను క్లోజ్ చేసుకుంది. దీంతో అశోక్‌కు అనుమానం వచ్చింది. 1930 సైబర్ క్రైం నెంబర్‌కు ఫోన్ చేసి, ఆమెపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితురాలిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.