iDreamPost
android-app
ios-app

బెనారస్ ఐఐటీ విద్యార్థినిపై దుండగుల దారుణం.. భగ్గుమన్న విద్యార్థులు!

బనారస్ హిందూ యూనివర్సిటీలో ఐఐటీ-బీహెచ్‌యూ విద్యార్థినిపై ముగ్గురు దుండగులు ఘోరానికి పాల్పడ్డారు. యువకులు బైక్ పై వచ్చి ఓ విద్యార్థినిని ఓ మూలకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమెను బెదిరించి లైంగికంగా వేధింపులకు పాల్పడి బలవంతంగా బట్టలు విప్పించారు.

బనారస్ హిందూ యూనివర్సిటీలో ఐఐటీ-బీహెచ్‌యూ విద్యార్థినిపై ముగ్గురు దుండగులు ఘోరానికి పాల్పడ్డారు. యువకులు బైక్ పై వచ్చి ఓ విద్యార్థినిని ఓ మూలకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమెను బెదిరించి లైంగికంగా వేధింపులకు పాల్పడి బలవంతంగా బట్టలు విప్పించారు.

బెనారస్ ఐఐటీ విద్యార్థినిపై దుండగుల దారుణం.. భగ్గుమన్న విద్యార్థులు!

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. బనారస్ హిందూ యూనివర్సిటీలో ఐఐటీ-బీహెచ్‌యూ విద్యార్థినిపై ముగ్గురు దుండగులు ఘోరానికి పాల్పడ్డారు. యువకులు బైక్ పై వచ్చి ఓ విద్యార్థినిని ఓ మూలకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమెను బెదిరించి లైంగికంగా వేధింపులకు పాల్పడి బలవంతంగా బట్టలు విప్పించారు. ఇక ఇంతటితో సరిపెట్టని ఆ దుర్మార్గులు.. ఆ యువతి బట్టలు లేకుండా ఉన్న సమయంలో సెల్ ఫోన్ లో వీడియోలు కూడా తీసుకున్నారు. ఇదే ఘటన ఇప్పుడు వారణాసిలో సంచలనంగా మారుతోంది. అనంతరం యువతి తనకు జరిగిన దారుణంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనపై బనారస్ హిందూ యూనివర్సిటీలో ఐఐటీ-బీహెచ్‌యూ విద్యార్థులు అంతా ఏకమై క్యాంపస్ లో కదం తొక్కి ధర్నాకు దిగారు. విద్యార్థినిపై దారుణానికి పాల్పడిన నిందితులను వెంటనే శిక్షించాలని ప్లకార్డులు పట్టుకుని గత రెండు రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. ఇక ఈ ఘటనపై విద్యార్థులులతో కలిసి సామాజిక వేత్తలు, మానవతా వాదులు బాధితురాలికి సపోర్టుగా నిలుస్తున్నారు. సమాజంలో తిరుగుతున్న ఇలాంటి చీడ పరుగులను వెంటనే ఏరిపారేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విద్యార్థిని బట్టలు విప్పించి ఆ తర్వాత వీడియోలు తీసిన ఈ దుర్యార్గుల దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetgaranti girişrobinbetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetJojobetGrandpashabetcasibomGrandpashabet Girişgrandpashabet giriş