iDreamPost
android-app
ios-app

మర్డర్‌ కేసులో అనుకోని ట్విస్ట్‌.. 3 ఏళ్ల తర్వాత..

దీంతో పెళ్లి తర్వాత కూడా ఆమెను చదువుకోవటానికి అత్తింటి వారు అనుమతించారు. పెళ్లి తర్వాత ఆమె పారా మెడికల్‌ చేయసాగింది. అయితే, పెళ్లయిన కొన్ని నెలలు సజావుగా సాగిన వీరి కాపురం..

దీంతో పెళ్లి తర్వాత కూడా ఆమెను చదువుకోవటానికి అత్తింటి వారు అనుమతించారు. పెళ్లి తర్వాత ఆమె పారా మెడికల్‌ చేయసాగింది. అయితే, పెళ్లయిన కొన్ని నెలలు సజావుగా సాగిన వీరి కాపురం..

మర్డర్‌ కేసులో అనుకోని ట్విస్ట్‌.. 3 ఏళ్ల తర్వాత..

కొన్నేళ్ల క్రితం ఓ మహిళ కనిపించకుండా పోయింది. ఆమె భర్తను వదిలి ఎవరితోనే పారిపోయిందని అందరూ నమ్మసాగారు. 3 ఏళ్ల తర్వాత ఆమె కుటుంసభ్యులకు వచ్చిన అనుమానంతో.. ఊహించని ట్విస్ట్‌ ఎదురైంది. ఆ మహిళ హత్యకు గురైందని, ఆమెన చంపింది భర్తేనని తేలింది. భర్త ఆమెను ఎందుకు చంపాడు? అంత దారుణమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడన్న వివరాల్లోకి వెళితే.. కర్ణాకటలోని బెలగావి జిల్లా, హీరెబుదునూర్‌కు చెందిన విఠల్‌ బంగి, శివలీల భార్యాభర్తలు. పెళ్లి అయ్యేనాటికి శివలీల చిన్న పిల్ల.

దీంతో పెళ్లి తర్వాత కూడా ఆమెను చదువుకోవటానికి అత్తింటి వారు అనుమతించారు. పెళ్లి తర్వాత ఆమె పారా మెడికల్‌ చేయసాగింది. అయితే, పెళ్లయిన కొన్ని నెలలు సజావుగా సాగిన వీరి కాపురం.. విఠల్‌ అనుమానం కారణంగా గొడవల్లోకి మళ్లింది. అతడు శివలీలను తరచుగా అనుమానిస్తూ ఉండేవాడు. ఆమెతో తరచుగా గొడవపడేవాడు. ఈ నేపథ్యంలోనే 2020 జనవరి నెలలో కూడా భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. భార్యపై ఆగ్రహానికి గురైన విఠల్‌ ఆమెను కొట్టి చంపాడు.

తర్వాత శవాన్ని దూరంగా తీసుకెళ్లి అడవిలో పడేశాడు. తర్వాత భార్య ఎవరితోనే లేచిపోయిందని పుకార్లు పుట్టించాడు. దీంతో ఆమె కుటుంబసభ్యులు కూడా ఏమీ చెయ్యలేకపోయారు. సంవత్సరాలు గడుస్తున్నా శివలీల ఇంటికి రాకపోవటంతో ఆమె కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. 15 రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విఠల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. భార్య మీద అనుమానంతో చంపేశానని ఒప్పుకున్నాడు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి