Venkateswarlu
భర్త చేసిన పాడు పని కారణంగా ఆ భార్య తీవ్ర మానసిక వేదన అనుభవించింది. ప్రతీ రోజూ ఆ భర్త ఆమె టార్చర్ చేస్తూ ఉండేవాడు. ఓ సారి ఆమె అశ్లీల వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు.
భర్త చేసిన పాడు పని కారణంగా ఆ భార్య తీవ్ర మానసిక వేదన అనుభవించింది. ప్రతీ రోజూ ఆ భర్త ఆమె టార్చర్ చేస్తూ ఉండేవాడు. ఓ సారి ఆమె అశ్లీల వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు.
Venkateswarlu
మనిషికి మనిషికి మధ్య సంబంధాలు రోజు రోజుకు దిగజారి పోతున్నాయి. తమ సంతోషం కోసం సైకోలుగా మారే వారు బాగా పెరిగిపోయారు. బంధం ఏదైనా కావచ్చు. టర్మ్స్ బాగున్నంత వరకు బాగానే ఉంటున్నారు. తర్వాత తమ నిజస్వరూపం బయటపెడుతున్నారు. భార్యాభర్తల మధ్య సంబంధం కూడా ఈ విధంగానే తయారైంది. కొంతమంది భర్తలు.. భార్యలను వదిలించుకోవటానికి చేయకూడని పనులన్నీ చేస్తున్నారు. కొంతమంది హద్దులు మీరి కూడా ప్రవర్తిస్తున్నారు.
ఏ భర్తా చేయని పనులు చేస్తున్నారు. తాజాగా, ఓ వ్యక్తి భార్య తనకు విడాకులు ఇవ్వటం లేదని దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను మానసికంగా చాలా ఇబ్బందులకు గురి చేశాడు. అయినా ఆమె అతడి మాట వినకపోవటంతో ఏకంగా అశ్లీల వీడియోతో బెదిరింపులకు దిగాడు. ఆ వీడియోతో నిత్యం వేధించసాగాడు. భర్త వేధింపులు భరించలేకపోయిన ఆ భార్య ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. అయితే, దేవుడి దయ వల్ల బయటపడింది. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బెళగావి నగరానికి చెందిన కిరణ్ పాటిల్ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన యువతితో పెళ్లి అయింది. పెళ్లయిన కొన్ని నెలలు వీరి కాపురం సజావుగానే సాగింది. తర్వాతినుంచి గొడవలు మొదలయ్యాయి. కిరణ్ తరచుగా భార్యతో గొడవ పెట్టుకునే వాడు. ఈ నేపథ్యంలోనే అతడికి వేరే అమ్మాయితో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కిరణ్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు.
ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాటానికి భార్యను విడాకులు అడుగుతూ ఉన్నాడు. అయితే, భార్య విడాకులు ఇవ్వడానికి ససేమీరా అంది. దీంతో ఇద్దరూ ఏకాంతంగా ఉన్న వీడియోతో బెదిరింపులకు దిగాడు. విడాకులు ఇవ్వకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ భయపెడుతూ ఉన్నాడు. అతడి బెదిరింపులకు అదిరిపోయిన భార్య.. ఎంతో బతిమాలింది. కలిసి ఉందామని, తనతో వచ్చిన సమస్య ఏంటని వేడుకుంది. అయినా అతడిలో మార్పు రాలేదు.
ఆ వీడియో అడ్డుపెట్టుకుని ప్రతీ రోజూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నాడు. అతడి మానసిక వేధింపుల కారణంగా ఆమె కృంగి క్రుశించిపోయింది. ఇక, తాను బతకటం వృధా అనుకుంది. ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. దీంతో పోలీసులను ఆశ్రయించింది. భర్తపై కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశాడు. అతడి మొబైల్ స్వాధీనం చేసుకుని, అందులోని వీడియోలను డిలీట్ చేశారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.