iDreamPost
android-app
ios-app

మత్తైన మాటలతో MPని ముగ్గులోకి దింపి.. రాధిక అక్క రేంజ్‌లో ముంచేసింది!

  • Published May 24, 2024 | 2:26 PM Updated Updated May 24, 2024 | 5:38 PM

Bangladesh MP Anwarul Azim Case: పైన ఫొటోలో కనిపిస్తున్న యువతిని చూశారా.. చూడ్డానికి ఎంతో అందంగా, అమాయకంగా కనిపిస్తుంది కదా.. అలా అనుకుంటే పొరపాటు.. రాధిక అక్కను మించి అక్కకు బ్యాగ్రౌండ్‌ ఉంది. ఏకంగా ఎంపీకే వల వేసి.. దారుణానికి ఒడిగట్టింది. ఆ వివరాలు..

Bangladesh MP Anwarul Azim Case: పైన ఫొటోలో కనిపిస్తున్న యువతిని చూశారా.. చూడ్డానికి ఎంతో అందంగా, అమాయకంగా కనిపిస్తుంది కదా.. అలా అనుకుంటే పొరపాటు.. రాధిక అక్కను మించి అక్కకు బ్యాగ్రౌండ్‌ ఉంది. ఏకంగా ఎంపీకే వల వేసి.. దారుణానికి ఒడిగట్టింది. ఆ వివరాలు..

  • Published May 24, 2024 | 2:26 PMUpdated May 24, 2024 | 5:38 PM
మత్తైన మాటలతో MPని ముగ్గులోకి దింపి.. రాధిక అక్క రేంజ్‌లో ముంచేసింది!

బంగ్లాదేశ్‌ అవామీ లీగ్‌ ఎంపీ.. ఇండియాలో మిస్సై.. ఆ తర్వాత దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌ అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజిమ్ అనార్ (56) కోల్‌కతాలో మే 13న దారుణ హత్యకు గురయ్యాడు. ఆగంతకులు ఎంపీని అత్యంత కిరాతకంగా హత్య చేసి.. ఆపై ఆయన డెడ్‌ బాడీని కూడా దాచేశారు. ఇక విదేశాలకు చెందిన ఎంపీపై ఇండియాలో ఇలాంటి దారుణం చోటు చేసుకోవడం.. రెండు దేశాల్లో సంచలనంగా మారింది. సీఐడీ అధికారులు ఈ కేసు దర్యాప్తును చేపట్టారు. ఈ క్రమంలో ముందుగా జిహాద్‌ హవ్లాదార్‌ను అనే ప్రొఫెషనల్‌ కిల్లర్‌ను అరెస్ట్‌ చేసి విచారించడంతో.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చికిత్స కోసం కోలక్‌కతాకు వచ్చిన ఎంపీ అన్వరుల్‌ అజిమ్‌ అనార్‌ను.. పక్కా ప్లాన్‌ ప్రకారమే మత్య చేసినట్లు దర్యాప్తులో తెలిసింది. ఈ ప్లాన్‌ వెనక ప్రధాన సూత్రధారి బంగ్లాదేశ్‌కు చెందిన అమెరికా పౌరుడు.. అక్తరుజ్జమాన్‌గా గుర్తించారు. అతడు హత్య గావించబడిన ఎంపీకి పాత స్నేహితుడు అని దర్యాప్తులో తెలిసింది.

ఈ కేసులో కీలకంగా వ్యవహరించి కిలాడీ లేడీని తాజాగా ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు యువతి హత్యకేసులో ప్రధాన సూత్రధారి అయిన అక్తరుజ్జమాన్‌కు ప్రియురాలు శిలాస్తీ రెహమాన్‌గా గుర్తించారు. ఎంపీ అన్వరుల్ హత్యకు ఆమెను ‘హనీట్రాప్’గా వినియోగించినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. తొలుత ఆమెతో ఫోన్‌ ద్వారా మాట్లాడించి.. ఆ తర్వాత ప్లాట్‌కు పిలిపించి.. అనంతరం.. ముందుగా వేసిన పథకం ప్రకారం నిందితులు ఎంపీ అన్వరుల్‌పై దాడి చేసి హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఎంపీ హత్య కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎంపీ హత్య తర్వాత శరీర భాగాలను ఎక్కడ పడవేశారో శిలాస్తీ రెహమాన్‌కు తెలుసని సీఐడీ ప్రాథమికంగా అంచనా వేస్తోంది. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన సూత్రదారి అక్తరుజ్జమాన్‌ను రెండు నెలల క్రితమే జిహాద్‌.. ముంబై నుంచి కోల్‌కతాకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. జిహాద్ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ప్రకారం అక్తరుజ్జమాన్ ఆదేశాల మేరకు అతను, మరో నలుగురు బంగ్లాదేశీయులతో కలిసి న్యూటౌన్ ఫ్లాట్‌లో ఎంపీని హత్య చేసినట్లు నేరం అంగీకరించాడు. ఈ కేసులో అక్తరుజ్జమాన్‌ ప్రియురాలు శిలాస్తీ రెహమాన్‌ నోరు విప్పితే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు అధికారులు.

ఎంపీ అన్వరుల్‌ను గొంతు నులిమి హత్య చేసిన అనంతరం మాంసం, ఎముకలు, చర్మాన్ని వేరుచేసి శరీరాన్ని ముక్కలుగా చేశారు. ఆ తర్వాత వాటిని.. ఫ్లాట్‌లోనే ఉన్న ఫిజ్‌లో భద్రపరిచారు. శరీర భాగాలు కుళ్లిపోయి.. వాసన రాకుండా బ్లీచింగ్ పౌడర్ వినియోగించారు. అనంతరం వేర్వేరు ట్రాలీల్లో మంత్రి డెడ్‌బాడీ పార్ట్స్‌ను బయటకు తీసుకెళ్లారు. చూసేవాళ్లకు అనుమానం రాకుండా ఉండేందుకు మంత్రి శరీర భాగాలకు వంట మసాలాలు, పసుపు కూడా కలిపారు. అయితే ముక్కలు చేసిన భాగాలను ఎక్కడెక్కడ వేశారనే విషయం ఇంకా తెలియలేదు. కిలాడీ లేదీ శిలాస్తీ నోరు విప్పితే ఈ వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మొత్తానికి ఈ కిలేడీ తన మత్తైన మాటలతో ఎంపీని ముగ్గులోకి దింపి.. రాధిక అక్క రేంజ్‌లో ముంచేసింది కదా అంటున్నారు.