iDreamPost
android-app
ios-app

పెళ్లికాని యువకుడిని ప్రేమించిన వివాహిత.. సహజీవనం చేస్తూ..!

ఆమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అయితే చదువు పేరుతో బెంగుళూరులో దిగిన సామిని దాస్.. ఇక్కడే ఓ కాలేజీలో నర్సింగ్ రెండవ సంవత్సరం చదువుతోంది. అయితే ఈ క్రమంలోనే ఈ మహిళకు కేరళకు చెందిన ఓ పెళ్లికాని యువకుడు పరిచయం అయ్యాడు. ఇంతే కాకుండా అతనితో సహజీవన కూడా చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఆమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అయితే చదువు పేరుతో బెంగుళూరులో దిగిన సామిని దాస్.. ఇక్కడే ఓ కాలేజీలో నర్సింగ్ రెండవ సంవత్సరం చదువుతోంది. అయితే ఈ క్రమంలోనే ఈ మహిళకు కేరళకు చెందిన ఓ పెళ్లికాని యువకుడు పరిచయం అయ్యాడు. ఇంతే కాకుండా అతనితో సహజీవన కూడా చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

పెళ్లికాని యువకుడిని ప్రేమించిన వివాహిత.. సహజీవనం చేస్తూ..!

పైన ఫోటోలో కనిపిస్తున్న వివాహిత పేరు సౌమిని దాస్. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఆమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అయితే చదువు పేరుతో బెంగుళూరులో దిగిన సామిని దాస్.. ఇక్కడే ఓ కాలేజీలో నర్సింగ్ రెండవ సంవత్సరం చదువుతోంది. అయితే ఈ క్రమంలోనే ఈ మహిళకు కేరళకు చెందిన ఓ పెళ్లికాని యువకుడు పరిచయం అయ్యాడు. వీరి పరిచయం రాను రాను ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. దీంతో ఒకరినొకరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఇంతే కాకుండా గత కొన్ని రోజుల నుంచి ఇద్దరూ ఒకే గదిలో ఉంటూ సహజీవనం కూడా చేస్తున్నారు. కట్ చేస్తే.. ఉన్నట్టుండి ఈ ప్రేమ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇంతకు అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. కలకత్తకు చెందిన సౌమిని దాస్ (21) అనే మహిళకు గత రెండేళ్ల కిందట ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అయితే పెళ్లైన కొంత కాలానికి ఈమె నర్సింగ్ చదువుకోవాలని అనుకుంది. భార్య కోరిక మేరకు ఆమె భర్త సామిని దాస్ ను నర్సింగ్ చేయడానికి బెంగుళూరు పంపించాడు. ఆమె అక్కడే చదువుకుంటూ అప్పుడప్పుడు భర్త వద్దకు వెళ్తుండేది. అయితే కాలేజీలో చదువుకునే రోజుల్లో ఈ వివాహితకు కేరళకు చెందిన అబ్రహం (25) అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఇతడు సర్వీస్ ఏజెన్సీని నడుపుతూ ఉండేవాడు. అలా వీరి పరిచయం రాను రాను ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు సమయం దొరికినప్పుడల్లా బయట కలుసుకుంటూ ఉండేవారు. ఇదిలా ఉంటే.. కాలేజీకి అప్పుడప్పుడు సెలవులు రావడంతో సౌమిని ప్రియుడు ఏజెన్సీలో పనికి వెళ్లేది. దీంతో వీళ్లు మరింత దగ్గరయ్యారు.

ఇకపోతే.. గత కొన్ని రోజుల నుంచి ఈ జంట నగరంలోని కొత్తనూరు పరిధిలోని ఓ అపార్ట్ మెంట్ లో అద్దెకు దిగారు. ఒకే గదిలో ఉంటూ సహజీవనం కూడా చేశారు. ఇక ఇటీవల సౌమిని దాస్ కలకత్తా వెళ్లి భర్తను కలిసింది. శనివారం తిరిగి మళ్లీ బెంగుళూరు వచ్చింది. ఈ క్రమంలోనే వీరిద్దరి ప్రేమ వ్యవహారం సౌమిని దాస్ భర్తకు తెలిసింది. దీంతో అతడు భార్యను నిలదీసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. వీరుంటున్న గదిలో ఈ జంట ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి అరుపులు విన్న స్థానికులు వెంటనే వారి వద్దకు చేరుకుని ఆస్పత్రికి తరలించారు. కానీ, ఫలితం లేకపోవడంతో చికిత్స పొందుతూ వీరిద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకుని మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet girişcasibom