iDreamPost
android-app
ios-app

ఇద్దరి యువకులతో బ్యూటీషియన్ ప్రేమాయణం.. ఆ కోరిక తీర్చుకుని..!

  • Published Nov 06, 2023 | 12:53 PM Updated Updated Nov 06, 2023 | 12:53 PM

బెంగుళూరుకు చెందిన ఓ యువతి ఇద్దరి యువకులతో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా కొంత కాలం పాటు ఇద్దరిని మెయింటెన్ చేస్తూ వచ్చింది. అయితే గత నెల ఈ యువతి ఊంచని దారుణానికి పాల్పడింది. అసలేం జరిగిందంటే?

బెంగుళూరుకు చెందిన ఓ యువతి ఇద్దరి యువకులతో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా కొంత కాలం పాటు ఇద్దరిని మెయింటెన్ చేస్తూ వచ్చింది. అయితే గత నెల ఈ యువతి ఊంచని దారుణానికి పాల్పడింది. అసలేం జరిగిందంటే?

  • Published Nov 06, 2023 | 12:53 PMUpdated Nov 06, 2023 | 12:53 PM
ఇద్దరి యువకులతో బ్యూటీషియన్ ప్రేమాయణం.. ఆ కోరిక తీర్చుకుని..!

ఈ మధ్యకాలంలో కొందరు వ్యక్తులు ఒకరికి తెలియకుండా ఒకరిని మెయింటెన్ చేస్తూ ప్రేమ పేరుతో మోసం చేస్తున్నారు. ఇక మోసపోయామని తెలుసుకుని ఆ ప్రేమికులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదంటే వారిపై హత్య చేసి పగను తీర్చుకోవడం చేస్తుంటారు. ఇదిలా ఉంటే.. ఓ బ్యూటీషియన్ ఒకరికి తెలియకుండా ఒకరిని ఏకంగా ఇద్దరి యువకులతో ప్రేమను వ్యవహారం నడిపించింది. తీరా ఆమె కోరిక తీర్చుకుని ఊహించని దారుణానికి పాల్పడింది. సంచలనం సృష్టించిన ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. బెంగుళూరుకు చెందిన శోభ అనే యువతికి గతంలో మంగుళూరుకు చెందిన చేతన్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. వీరి పరిచయం చివరికి ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు గత 7 నెలలగా సహజీవనం చేస్తూ వచ్చారు. అయితే చేతన్ నగరంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ బాగానే సంపాదించేవాడు. ఈ క్రమంలోనే శోభకు చిక్కతిరుపతికి చెందిన సతీష్ అనే మరో యువకుడు పరిచయం కావడంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లుగా తెలుస్తుంది. ఇటీవల సతీష్ భూమి అమ్మగా డబ్బులు వచ్చాయి. ఇక తన ప్రియురాలు శోభ కోరిక మేరకు సతీష్ రూ.20 లక్షలు వెచ్చించి ఆమెకు ఓ బ్యూటీపార్లర్ కట్టించాడు.

ఈ క్రమంలోనే శోభతో చేతన్ ప్రేమ వ్యవహారం సతీష్ కు తెలియడంతో షాక్ గురయ్యాడు. శోభతో కలిసి చేతన్ ను హత్య చేయాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే గత నెల 26న ఆ యవకుడిని ఓ చోటకు రావాలని నమ్మించి శోభ, సతీష్, మరి కొందరు వ్యక్తులు కలిసి చేతన్ ను అతి దారుణంగా హత్య చేశారు. అనంతరం అతడి మృతదేహాన్ని దక్షిణ పినాకిలో పడేసి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టగా.. చేతన్ ను హత్య చేసింది శోభ, సతీష్ తో పాటు మరి కొంతమంది ఉన్నారని పోలీసులు గుర్తించారు. ఇక తాజాగా పోలీసులు శోభతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

Jojobet Girişİmajbetultrabetjojobetjojobetcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetcasibomgrandpashabet