iDreamPost
android-app
ios-app

కోడలితో మామ పాడు పని.. అలా చేయమనే సరికి

దేశంలో ప్రతి పౌరుడు గర్వించదగ్గ ఉద్యోగం చేస్తున్నాడు. దేశ పౌరులను కాపాడే ఆర్మీ జవాన్. కానీ అతడి బుద్ది మాత్రం వక్రం. మేనకోడలు వరుసయ్యే ఆమెతో పాడు పని చేశాడు. చివరకు

దేశంలో ప్రతి పౌరుడు గర్వించదగ్గ ఉద్యోగం చేస్తున్నాడు. దేశ పౌరులను కాపాడే ఆర్మీ జవాన్. కానీ అతడి బుద్ది మాత్రం వక్రం. మేనకోడలు వరుసయ్యే ఆమెతో పాడు పని చేశాడు. చివరకు

కోడలితో మామ పాడు పని.. అలా చేయమనే సరికి

అతడు ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాడు. దేశకోసం ప్రాణాలు అర్పించే ఆర్మీ జవాన్ . సరిహద్దుల్లో పహారా కాసే అతడికి అందమైన ఫ్యామిలీ కూడా ఉంది. కానీ ఏం లాభం.. అతడిది వక్రమైన బుద్ది. సమీప బంధువుపై కన్నేశాడు. ఆమెను లొంగదీసుకున్నాడు. చివరకు పెళ్లి చేసుకోమనే సరికి ఆమె అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు.  ఆ యువతిని మట్టుబెట్టి.. సాక్ష్యాలు లేకుండా చేశాడు. ఇందుకు సహకరించింది జవాన్ భార్య కూడా. ఆ తర్వాత ఏం ఎరగన్నట్లు విధులకు వెళ్లిపోయాడు.. అయితే స్థానికులకు అర్థనగ్నంగా పొలంలో రక్తంతో తడిసి ఉన్న ఓ అమ్మాయి మృతదేహం కనిపించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాల్ డేటా ఆధారంగా నిందితుడ్ని అరెస్టు చేశారు.

చివరకు నిందితుడు బాధితురాలికి మామయ్య అవుతాడని తెలిసి అవాక్కయ్యారు. మేన కోడలు వరుసయ్యే అమ్మాయిని వంచించి, నమ్మకద్రోహం చేసి హత్య చేశాడు ఆమె మామ. కుటుంబ బాంధవ్యాలను భయపట్టేలా ఉన్న ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పింటూ సింగ్ రాజ్ పుత్.. ఆర్మీలో లాన్స్ నాయక్‍గా పనిచేస్తున్నాడు. ఉజ్జయిని నివాసి అయిన భరత్ సింగ్ రాథోడ్ కుమార్తె సవితా రాథోడ్ ఆమెకు మామ వరుస అవుతాడు. అమ్మాయి.. రత్లాంలోని సఖ్వాల్ నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటూ నర్సింగ్ కోచ్ చేస్తోంది. ఈ క్రమంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరి మధ్య శారీరక సంబంధం మొదలైంది.

అయితే సవితా తరచుగా తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుంది. అప్పటికే పెళ్లైన పింటూ.. దాట వేసుకుంటూ వస్తున్నాడు. ఇటీవల జమ్ము కాశ్మీర్ నుండి సెలవులపై ఇంటికి వచ్చిన పింటూ ఈ విషయంపై తేల్చుకుని విధుల్లో చేరాలని అనుకున్నాడు. ఏప్రిల్ 1వ తేదీన సాయంత్రం సవితను కలవాలని ఫోన్ చేశాడు. ఇద్దరు కలిసి అదే రోజు రాత్రి రత్లామ్‌లోని మోవ్-నీముచ్ హైవే నాలుగు లేన్‌లో సమీపంలోని మైదానంలోకి వెళ్లారు. తన వెంట తెచ్చుకున్న కత్తితో సవిత ఛాతిపై దాడి చేశాడు. అనంతరం కత్తితో గొంతు కోశాడు. దీంతో అక్కడిక్కడే ప్రియురాలు అతడి కళ్లముందే గిలగిలా కొట్టుకుని చనిపోయింది. మృతదేహాన్ని అక్కడే ఉన్న పొదల్లో పడేసి.. స్వగ్రామానికి వెళ్లాడు.

ఇంటికి వెళ్లి తన భార్య శీతల్‌కు జరిగిందంతా చెప్పాడు. అనంతరం భార్య కూడా సాక్ష్యాలను చెరిపేసేందుకు ప్రయత్నం చేసింది. దృశ్యం సినిమా తరహాలో ఆ గ్రామంలో హత్య జరిగిన రోజు తాము లేమని చెప్పేందుకు భార్యను ఆమె పుట్టింట్లో వదిలి.. అదే రోజు రాత్రి పింటూ ఢిల్లీ నుండి విమానంలో జమ్ము కాశ్మీర్ చేరుకుని డ్యూటీలో చేరాడు. అమ్మాయి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. కాల్ డేటా ఆధారంగా నిందితుడ్ని గుర్తించారు. కాగా, నిందితుడు పింటూను అరెస్టు చేశారు. అలాగే భర్తకు సహకరించిన భార్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.