Dharani
నెల రోజుల క్రితం ఉద్యోగంలో చేరిన శ్రీకాకుళానికి చెందిన ఓ యువకుడు.. ఇరాన్ లో మృతి చెందాడు. అసలేం జరిగింది అంటే..
నెల రోజుల క్రితం ఉద్యోగంలో చేరిన శ్రీకాకుళానికి చెందిన ఓ యువకుడు.. ఇరాన్ లో మృతి చెందాడు. అసలేం జరిగింది అంటే..
Dharani
ఆ యువకుడు ఇంటర్ వరకు చదివాడు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించలేదో.. లేక చదువు మీద ఇంట్రెస్ట్ లేదో తెలియదు కానీ.. ఆ తర్వాత చదవలేదు. తల్లీదండ్రులు రోజు వారి కూలీలు.. ఇక సదరు యువకుడికి ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఉన్నారు. కుటుంబ పోషణ భారం కావడంతో.. అతడు కూడా పని చేయాలని భావించాడు. ఆర్థికంగా తల్లిదండ్రులకు మద్దతు ఇవ్వడం కోసం పనిలో చేరాలని భావించాడు. అనుకున్నట్లుగానే నెల రోజుల క్రితం ఉద్యోగంలో చేరాడు. త్వరలోనే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని భావించారు. కానీ అంతలోనే వారి ఆశలు అడియాసలయ్యాయి. ఉద్యోగంలో చేరిన కొడుకు.. దేశం కానీ దేశంలో అనగా ఇరాన్ లో మృతి చెందాడు. ఆ వివరాలు..
ఇరాన్‌లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు. మూడు రోజుల క్రితం ఇరాన్‌లో ఓడ మునిగి పోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా, కంచిలి మండలం బొగాబెణి పంచాయతీ పరిధి జెన్నాఘాయికి చెందిన ఉమ్మిడి సింహాచలం (21) అనే యువకుడు మృతిచెందినట్లు ఆలస్యంగా తెలిసింది. అది కూడా సోషల్ మీడియా వల్ల వెలుగులోకి వచ్చింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
శ్రీకాకుళం జిల్లాకు చెందిన సింహాచలం.. ఇంటర్మీడియట్ చదివాడు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం అతడు రాజస్థాన్‌కు చెందిన కన్సల్టెన్సీ ద్వారా మర్చంట్ నేవీలో ఉద్యోగంలో చేరాడు. అయితే అతడు విధులు నిర్వహిస్తోన్న ఓడ.. మూడు రోజుల క్రితం ఇరాన్‌లో సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో సింహాచలం కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు, బంధువులు తెలిపారు.
సింహాచలం తల్లిదండ్రులు ఊర్మిళ, రామయ్య రోజుకూలీలు. గ్రామంలోనే పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇక సింహాచలానికి ముగ్గురు అక్కచెల్లెలు ఉన్నారు. ఇక అతడు చనిపోయిన విషయం.. బుధవారం సోషల్ మీడియా ద్వారా సింహాచలం కుటుంబ సభ్యులకు తెలిసింది. చేతికి అందికి వచ్చిన చెట్టంతా కొడుకు.. ఇలా చనిపోవడాన్ని అతడి తల్లిదండ్రలు జీర్ణించుకోలేకపోతున్నారు. కొడునును కడసారి చూసుకోవాలని వారు ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో తమ కొడుకు మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని.. కోరుతున్నారు.