Dharani
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ వివరాలు..
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ వివరాలు..
Dharani
ఈమధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, రాంగ్ రూట్ లో వెళ్లడంతో పాటు.. శీతాకాలం పొగ మంచు కూడా ప్రమాదాలకు కారణం అవుతుంది. ఇక శనివారం నాడు సూర్యపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ముందు వాహనం టైరు పేలిపోవడంతో.. దాన్ని తప్పించే ప్రయత్నంలో ఉండగా.. టీఎస్ఆర్టీసీ రాజధాని బస్సు పల్టీలు కొట్టిన సంగతి తెలసిందే. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు. ఇదిలా ఉండగానే నేడు అనగా.. ఆదివారం నాడు మరో బస్సు యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు.. లారీని వెనక నుంచి ఢీ కొట్టడంతో ఈ దారుణం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. యాక్సిడెంట్ కారణంగా బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. అంతేకాక బస్సు డ్రైవర్ వినోద్ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. బస్సులో ప్రయాణిస్తున్న మరో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే గాయపడ్డ వారిని.. ముందుగా కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు.
ఈక్రమంలో గాయపడ్డ వారిలో సీతమ్మ (65) అనే వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి.. ప్రమాదం సంభవించడానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. టీఎస్‌ఆర్టీసీ బస్సు మిర్యాలగూడ నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది.
అలానే శనివారం నాడు.. సూర్యాపేట జిల్లా మోతె మండలం మావిళ్లగూడెం ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న టీఎస్ఆర్టీసీ రాజధాని బస్సు సూర్యాపేట జిల్లా మావిళ్లగూడెం వద్దకు రాగానే.. బస్సు ముందు వెళ్తున్న వాహనం టైర్ అకస్మాత్తుగా పేలిపోయింది. వెంటనే అప్రమత్తమైన ఆర్టీసీ డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు తిప్పాడు. కానీ అప్పటికే కాస్త స్పీడ్ గా వెళ్తున్న బస్సు.. కంట్రోల్ తప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు కానీ.. ఆరుగురు ప్రయాణికులు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు.