iDreamPost
android-app
ios-app

AP: గల్ఫ్‌లో భర్త కష్టం.. ఇక్కడ భార్య మాత్రం ఇద్దరు మగాళ్లతో రిలేషన్!

  • Published Apr 25, 2024 | 2:53 PM Updated Updated Apr 25, 2024 | 2:53 PM

భర్త కుటుంబం కోసం గల్ఫ్‌లో కష్టపడుతుంటే.. భార్య మాత్రం ఇద్దరు మగాళ్లతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. మరి చివరకు ఏం జరిగింది అంటే..

భర్త కుటుంబం కోసం గల్ఫ్‌లో కష్టపడుతుంటే.. భార్య మాత్రం ఇద్దరు మగాళ్లతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. మరి చివరకు ఏం జరిగింది అంటే..

  • Published Apr 25, 2024 | 2:53 PMUpdated Apr 25, 2024 | 2:53 PM
AP: గల్ఫ్‌లో భర్త కష్టం.. ఇక్కడ భార్య మాత్రం ఇద్దరు మగాళ్లతో రిలేషన్!

అతడు భార్యాబిడ్డలను బాగా చూసుకోవాలని భావించాడు. వారికి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం కన్నవారిని, కట్టుకున్నదాన్ని.. కడుపున పుట్టిన బిడ్డలను వదిలి.. ఉపాధి కోసం పరాయి దేశాలకు వెళ్లాడు. కుటుంబం కోసం ఎంత కష్టమైన సరే ఓర్చుకునేవాడు. తమ కోసం ఇంత చేస్తున్న భర్తకు.. అండగా ఉండాల్సిన భార్య.. పక్క చూపులు చూసింది. భర్త త్యాగాన్ని అర్థం చేసుకోకుండా.. తన సుఖం తాను చూసుకుంది. భర్త కష్టపడి సంపాదించి పంపే సొమ్ముతో జల్సా చేస్తూ.. పరాయి మగవాడి మోజులో పడింది. అంతటితో ఆగిందా అంటే.. లేదు.. మరో యువకుడు పరిచయం కావడంతో.. ఫస్ట్‌ లవర్‌ని పక్కకు పెట్టింది. విషయం తెలుసుకున్న మొదటి బాయ్‌ఫ్రెండ్‌.. దారుణానికి ఒడిగట్టాడు. ఆ వివరాలు..

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం రెల్లుగడ్డ గ్రామంలో వివాహిత దారుణ హత్య కేసు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివాహిత హత్యకు అక్రమ సంబంధమే కారణంగా ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు పోలీసులు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రెల్లుగడ్డ ప్రాంతానికి చెందిన బంతు మణికుమారి భర్త గత కొంత కాలంగా గల్ఫ్‌లో ఉంటున్నాడు. ఆమె మాత్రం అత్తమామలతో కలిసి రెల్లుగడ్డ గ్రామంలో ఉంటుంది.

ఈక్రమంలో ఆమెకు ఇంటి పక్కన ఉన్న కొంబత్తుల నవీన్‌ కుమార్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. చివరకు అది కాస్త వివాహేతర బంధానికి దారి తీసింది. ఇక నవీన్‌-మణికుమారి బంధం గురించి కొన్ని నెలల క్రితం ఆమె భర్త కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. దాంతో వాళ్లు పంచాయతీ పెట్టి నిలదీశారు. ఈ క్రమంలో ఇకపై తాము విడిగా ఉంటామని.. ఎవరి దారి వాళ్లు చూసుకుంటామని నవీన్‌, మణికుమారి వారికి మాట ఇచ్చారు. కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నారు. తర్వాత మళ్లీ తమ బంధాన్ని కొనసాగించసాగారు.

అయితే ఏం జరిగిందో తెలియదు కానీ.. గత కొన్నాళ్లుగా.. మణి కుమారి, నవీన్‌ను దూరం పెట్టసాగింది. అతడితో సరిగా మాట్లాడటం మానేసింది. ఆమె ప్రవర్తన మీద అనుమానం వచ్చిన నవీన్‌.. మణి కుమారి కదలికలపై కన్నేశాడు. దాంతో అతడికి షాకింగ్‌ విషయం తెలిసింది. మణి కుమారి తనకు హ్యాండిచ్చి.. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్నాడు. దీనికి తోడు మరో వారం రోజుల్లో మణికుమారి భర్త వద్దకు వెళ్లిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుందని అతడికి తెలిసింది. దాంతో ఆగ్రహావేశాలకు లోనైన నవీన్‌.. మణికుమారి హత్యకు ప్లాన్‌ చేశాడు.

కాపు కాచి.. మాటు వేసి

మణి కుమారి తనతో కాకుండా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న నవీన్‌ కుమార్‌ ఆమెను హత్య చేయాలని భావించాడు. దీనిలో భాగంగా దారుణం చోటు చేసుకున్న రోజున ఉదయం 9 గంటలకే హతురాలి ఇంట్లోకి చొరబడి.. బాత్రూమ్‌లో దాక్కుని.. ఆమె ఫోన్ సంభాషణలు విన్నాడు. ఆపై ఆమె ఇంట్లో ఉన్న కత్తితోనే మృతురాలి మీద దాడికి పాల్పడ్డాడు. మణికుమారి కిచెన్లో వంట చేస్తూ ఫోన్ మాట్లాడుతుండగా వెనుక నుంచి వచ్చిన నవీన్‌.. కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటనలో మణికుమారి అక్కడికక్కడే మృతి చెందింది.

ఈ గొడవ గురించి తెలుసుకున్న మణికుమారి తోడికోడలు కుమారుడు వచ్చి చూడగా అప్పటికే ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. భయంతో కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు వచ్చి జరిగిన దారుణాన్ని చూశారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలికి వచ్చి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నవీన్‌ కుమార్‌ కోసం గాలిస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom