iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: హైదరాబాద్ లో మరో బాలిక కిడ్నాప్!

  • Published Jul 06, 2023 | 4:43 PM Updated Updated Jul 06, 2023 | 4:43 PM
  • Published Jul 06, 2023 | 4:43 PMUpdated Jul 06, 2023 | 4:43 PM
బ్రేకింగ్: హైదరాబాద్ లో మరో బాలిక కిడ్నాప్!

హైదరాబాద్ లో వరుస బాలికల కిడ్నాప్ ఘటనలు ప్రజలను భయందోళనలకు గురి చేస్తున్నాయి. కాగా, గురువారం ఉదయం ఘట్ కేసర్ లో కృష్ణవేణి అనే నాలుగేళ్ల బాలిక కిడ్నాప్ ఘటన మరువకముందే నగరంలో మరో బాలిక కిడ్నాప్ అయింది. ఈ ఘటనతో అప్రమత్తమైన బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇక మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నట్టుండి ఆ బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్ ఓ ప్రాంతంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు ఆడ పిల్లల సంతానం. ఇదిలా ఉంటే.. ఈ భార్యాభర్తలు గత మూడు రోజుల కిందట గొడవపడి పిల్లలను ఇంట్లోనే వదిలేసి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. అప్పటి నుంచి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. ఇదే మంచి సమయం అనుకున్న కొందరు దుండగులు.. గురువారం మధ్యాహ్నం ఓ బాలికను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş