iDreamPost
android-app
ios-app

భర్తను కాదని ఇద్దరితో వివాహేతర సంబంధం! దారుణం ఏంటంటే?

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ కట్టుకున్న భర్తను కాదని మరో ఇద్దరి వ్యక్తులతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. భర్తను అడ్డు తొలగించాలని ఆ మహిళ కిరాతకానికి పాల్పడింది.

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ కట్టుకున్న భర్తను కాదని మరో ఇద్దరి వ్యక్తులతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. భర్తను అడ్డు తొలగించాలని ఆ మహిళ కిరాతకానికి పాల్పడింది.

భర్తను కాదని ఇద్దరితో వివాహేతర సంబంధం! దారుణం ఏంటంటే?

ఈ రోజుల్లో కొందరు పెళ్లైన వ్యక్తులు ఇంట్లో కట్టుకున్నవాళ్లు ఉండగానే మరొకరితో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త.. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు అక్రమ సంబంధం కోసం పాకులాడి.. చివరికి కట్టుకున్నవాళ్లను కాటికి పంపుతున్నారు. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా రోజుకో చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ వరుస ఘటనలు మరువకముందే ఇలాంటిదే మరోకటి వెలుగు చోటు చేసుకుంది. ఓ 40 ఏళ్ల మహిళ తన ఇద్దరి ప్రియుళ్లతో కలిసి దారుణానికి పాల్పడింది. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతోంది.

అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని అన్నమయ్య జిల్లా కలకడ మండలం సింగనొడ్డిపల్లెలో దాదినేని వెంకటశివ (45)-రమణమ్మ (40) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఉన్న ఒక్క కూతురికి గతంలో వివాహం జరిపించారు. అయితే ఈ దంపతులు ఏడాది నుంచి మదనపల్లెలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ అక్కడే ఉన్న టమాటా మార్కెట్ యార్డులో పని చేస్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే రమణమ్మ వక్రమార్గంలోకి వెళ్లింది. డ్రైవర్ అయిన షేక్ బషీర్ తో అక్రమ సంబంధాన్ని కొనసాగింది.

ఇంతటితో సరిపెట్టని ఈ ఇల్లాలు.. వీరుంటున్న ఇంటి సమీపంలోని గగన్ (21) అనే యువకుడితో సైతం వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఇలా ఇద్దరితో రమణమ్మ ఎంజాయ్ చేస్తూ వచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ మహిళ ప్రియుడైన షేక్ బషీర్.. ప్రియురాలి భర్త వెంకటశివను అడ్డు తొలిగించాలని అనుకున్నాడు. ఇదే విషయాన్ని రమణమ్మకు చెప్పడంతో ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలోనే బషీర్..రమణమ్మ మరో ప్రియుడైన గగన్ కు, వెంకటశివకు మధ్య గొడవలు ఉన్నాయని తెలుసుకున్నాడు. ఇక రమణమ్మ భర్త వెంకటశివను ప్రాణాలతో లేకుండా చేస్తే.. మీకు రూ.25,000 వేలు ఇస్తానని గగన్ తో పాటు మరో మహిళకు ఆశ చూపాడు. దీనికి వాళ్లు కూడా సరే అన్నారు. హత్యకు ప్లాన్ గీసినా.. అది సక్సెస్ కాలేదు.

బషీర్ ఈ సారి పక్కాగా పథకం రచించాడు. ఇందులో భాగంగానే ఈ నెల 29న వెంటకశివ ఫుల్ గా మద్యం సేవించి ఇంటికొచ్చాడు. ఇది గమనించిన రమణమ్మ.. మరో ప్రియుడైన గగన్, మరో మహిళతో కలిసి ముగ్గురు వెంకటశివను దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్తుండగా మృతుడి సోదరుడు గమనించాడు. ఏం జరిగిందని రమణమ్మను ప్రశ్నించగా నోట్లో నీళ్లు నమిలింది. దీంతో అతడు వెంటనే స్థానిక పోలీసులకు సమచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అనంతరం పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అసలు నిజాన్ని బయటపెట్టారు. ఇక పరారీలో ఉన్న ప్రధాన సూత్రదారి అయిన షేక్ బషీర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇద్దరి ప్రియుళ్లతో కలిసి భర్తను చంపిన రమణమ్మ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişBetcioivermectin tabletpokerklaspokerklaspokerklasmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Giriş