iDreamPost
android-app
ios-app

కన్న తల్లిపై దారుణానికి ఒడిగట్టిన కుమారుడు! ఏం చేశాడంటే?

కన్న తల్లిపై దారుణానికి ఒడిగట్టిన కుమారుడు! ఏం చేశాడంటే?

సమాజంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే అసలు మనం మనుషుల మధ్యే ఉన్నామా అన్న అనుమానం కలగకమానదు. వావి వరసలు మరిచి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇదిలా ఉంటే.. కనిపెంచిన కుమారుడు ప్రయోజకుడై చివరిక్షణంలో మా బాగోగులు చూస్తారని ప్రతీ తల్లిదండ్రులు ఆశపడుతుంటారు. కానీ, కొందరు కొడుకులు కన్న తల్లిదండ్రులపై దారుణాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే ఓ యువకుడు కన్న తల్లి అని కూడా చూడకుండా ఘోరానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని అనంతపురం జిల్లా కంబదూరులో గోపి-సుజాత (68) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ప్రణీత్ అనే కుమారుడు ఉన్నాడు. బాగా చదువుకుని కొడుకు ప్రయోజకుడు అవుతాడని అనుకుంటే.. చెడు తిరుగుళ్లు తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. తరుచు తాగుడుకు డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులతో గొడవకు దిగేవాడు. ఇకపోతే.. ప్రణీత్ సోమవారం కూడా మద్యానికి డబ్బుల కోసం తల్లితో గొడవకు దిగాడు. క్షణికావేశంలో కుమారుడు.. తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో సుజాత మంటల్లో కాలిబూడిదై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్థానికులు మాత్రం ఆమె కరెంట్ షాక్ తో మరణించిందని భావించారు.

ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంతా పరిశీలించారు. ఆ తర్వాత మృతురాలి కుటుంబ సభ్యులను విచారించారు. ఈ క్రమంలోనే కుమారుడు ప్రణీత్ ను విచారించగా.. అసలు నిజాలు బయటపడ్డాయి. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిపై పెట్రోల్ పోసి నిప్పటించిన కుమారుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobet